ఆ మూడు పార్టీలతో అవగాహన కుదిరిందా?

మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసే పనిలోపడ్డారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కలిసొచ్చే పార్టీలను కలుపుకుని వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీన్లో భాగంగా తెలుగుదేశం, ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ఆ మూడు పార్టీల ముఖ్యనేతలు చాడా వెంకట రెడ్డి, తమ్మినేని, ఎల్. రమణలతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ఏంటంటే… మేం బలంగా ఉన్న చోట మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీరు బలంగా ఉన్నారనుకున్న చోట బేషరతుగా మా మద్దతు మీకుంటుంది అని ఆయా పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదనపై సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో సర్దుబాటు అనేది జిల్లా, మండల స్థాయి నేతల అభీష్టం ప్రకారం చేసుకోవచ్చని సొంత పార్టీ వర్గాలకు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. స్థానిక నాయకత్వాలే దీనిపై చర్చించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చని సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది.

తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ ప్రతిపాదనపై కొంత సానుకూలంగానే స్పందించినట్టు చెబుతున్నారు. తాము సొంతంగా కొన్ని చోట్ల పోటీకి సిద్ధమౌతున్నామనీ, అవి మినహా ఇతర ప్రాంతాల్లో మద్దతు ఇచ్చేందుకు సిద్ధమనే ధోరణిలోనే టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ కూడా స్థానిక నాయకత్వాలకే తుది నిర్ణయం వదిలేయాలని భావిస్తోందట. మొత్తానికి, ఆ మూడు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సర్దుబాట్లు చేసుకునే వ్యూహంలోనే ఉంది. ఈ పొత్తులకు సంబంధించి టీడీపీగానీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగానీ అధికారికంగా ప్రస్తుతానికి ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. కానీ, దాదాపుగా సర్దుబాట్లకు సిద్ధమనే వాతావరణమే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే తరహా పొత్తులే పెట్టుకున్నా… పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగలేదు. మహాకూటమి విఫలం కావడానికి అదో కారణం. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడితే తాజా సర్దుబాటు ప్రయత్నం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతిమంగా ఏం జరుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close