ముద్ర‌గ‌డ‌పై ప‌వ‌న్.. ఇప్పుడిలా.. అప్పుడ‌లా..!

కాపుల రిజర్వేషన్ల అంశం ఏపీలో రాజ‌కీయంగా ఎంత ప్రాధాన్య‌త ఉన్న‌దో తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇదో స‌మ‌స్య‌గా మార‌కూడ‌ద‌న్న ఉద్దేశంతోనే ప్ర‌భుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తోంది. త్వ‌ర‌లోనే రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌బోతున్న‌ట్టు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతూ వ‌స్తున్నారు. అయితే, మ‌రోప‌క్క ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మిస్తాన‌ని చెబుతూనే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ అంశంపై మ‌రోసారి స్పందించారు. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా టీమ్ శ‌త‌ఘ్నితో మాట్లాడారు. అంద‌రికీ విద్యా వైద్యంతోపాటు స‌మాన అవ‌కాశాలు ఉండాల‌ని అప్ప‌ట్లో అంబేద్క‌ర్ ఆకాంక్షించేవారని చెప్పారు. ఆయ‌న‌కు ఘ‌న నివాళి అర్పించాలంటే రిజ‌ర్వేష‌న్లు లేని స‌మాజం కావాల‌న్నారు. వెనుక‌బ‌డిన వారికోస‌మే రిజ‌ర్వేష‌న్లు పెట్టార‌నీ, కానీ ప్ర‌భుత్వాలు స‌రిగా అమ‌లు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే డిమాండ్లు పెరుగుతూ వ‌స్తున్నాయ‌ని ప‌వ‌న్ అన్నారు.

ఇక‌, కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై ప్ర‌స్థావిస్తూ.. ఇస్తామ‌ని నిర్ణ‌యిస్తే ఇవ్వండీ, లేదంటే ఇవ్వ‌డం కుద‌ర‌దు అని స్ప‌ష్టం చెప్పేయాల‌నీ, నాన్చుడు ధోర‌ణి అవ‌లంభించొద్దు అని ప‌వన్ అన్నారు. తాను అన్ని కులాల‌నూ గౌర‌విస్తాన‌నీ, ఒక వ‌ర్గానికి తానెప్పుడూ ప‌రిమితం కాకుండా ఉంటాన‌ని చెప్పారు. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ఉద్య‌మం గురించి మాట్లాడుతూ… ఆయ‌న ఉద్య‌మాన్ని ఆప‌కుండా కొన‌సాగించి ఉండాల్సింద‌న్నారు. ఆయ‌న నిర‌స‌న తెల‌ప‌డం అనేది ఆయ‌న వ్య‌క్తిగ‌త హ‌క్కు అనీ, ఆయ‌న పాద‌యాత్ర‌ను ప్ర‌భుత్వంగానీ, పోలీసులుగానీ అడ్డుకునే అధికారం ఎవ్వ‌రికీ లేద‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగితే మాత్ర‌మే వారు జోక్యం చేసుకోవ‌డానికి ఆస్కారం ఉంటుంద‌న్నారు.

ప‌వ‌న్ తాజా అభిప్రాయం ఎలా ఉందంటే… ముద్ర‌గ‌డ ఉద్య‌మానికి సంఘీభావం ప్ర‌క‌టించిన‌ట్టు అనుకోవ‌చ్చా! ప్ర‌భుత్వాలు, పోలీసులు ఆయ‌న నిర‌స‌న‌ను అడ్డుకోవ‌డం స‌రికాద‌న్నారు.. అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది! కానీ, కొద్దిరోజుల క్రిత‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్, సీఎం చంద్ర‌బాబును క‌లుసుకున్న సంగ‌తి ఇక్క‌డ గుర్తు చేసుకోవాలి. ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై విదేశీ బృందంతో అధ్య‌య‌నం చేయించి, దాని గురించి మాట్లాడేందుకు అమ‌రావ‌తి వెళ్లి ముఖ్య‌మంత్రిని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా కాపుల రిజ‌ర్వేష‌న్ల గురించి ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చిన‌ట్టూ చెప్పారు! కాపుల విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రే క‌రెక్ట్ అన్న‌ట్టుగా ప‌వ‌న్ మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే సరైందని అప్పుడు పవన్ అభిప్రాయపడ్డట్టు కథనాలొచ్చాయి. అంతేకాదు, పాదయాత్రల వల్లనే సమస్యలు పరిష్కారాలు అవుతాయని అనుకోవడం పొరపాటని కామెంట్ చేసినట్టు కూడా మీడియాలో వ‌చ్చింది! ఇది

ముద్ర‌గ‌డ‌ను ఉద్దేశించి చేసిందే క‌దా. కానీ, ఇప్పుడేమో ముద్ర‌గ‌డ పాదయాత్ర ఆప‌కుండా ఉండాల్సింద‌నీ, ఆయ‌న్ని అడ్డుకోవ‌డం వ్య‌క్తిగ‌త హ‌క్కుల్ని కాల‌రాసిన‌ట్టే అవుతుంద‌ని ప‌వ‌న్ మాట్లాడుతున్నారేంటి..? అంటే, చంద్ర‌బాబు ఎదురుగా కూర్చునేస‌రికి ఒక‌లా… త‌న సోష‌ల్ మీడియా సిబ్బంది ఎదురుగా ఉన్న‌ప్పుడు మ‌రోలా ప‌వ‌న్ మాట్లాడార‌ని అర్థం చేసుకోవాలా..? లేదంటే.. ముద్ర‌గ‌డ నిర‌స‌న తెల‌ప‌డం అనేది ఆయ‌న వ్య‌క్తిగ‌త యాంగిల్ నుంచీ ఇప్పుడు చూస్తున్నారా…? కాపుల రిజ‌ర్వేష‌న్లు అనేది ప్ర‌భుత్వం కోణం నుంచీ నాడు అర్థం చేసుకున్నారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close