దేవర తరవాత కొరటాల శివ సినిమా ఏమిటి? ఎవరితో? అనేది ఇంకా తేలలేదు. నిజానికి ఆయన ‘దేవర 2’ చేయాలి. కానీ ఈ సీక్వెల్ ఆగిపోయింది. కొంతమంది హీరోల్ని కలిసి, కొరటాల శివ కథ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకో అది వర్కవుట్ కాలేదు. ఇటీవల కొరటాల శివ పవన్ కల్యాణ్ ని కలుసుకొన్నారని సమాచారం. ఆయనకు ఓ కథ వినిపించార్ట. పవన్ తో సినిమా చేయాలని కొరటాల ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ‘భరత్ అనే నేను’ లాంటి కాన్సెప్ట్ పవన్‌కల్యాణ్ లాంటి హీరోకి పడితే బాగుంటుందన్నది అభిమానుల ఆలోచన కూడా. కొరటాల కూడా ఇదే విషయం చాలా సందర్భాల్లో చెప్పారు. అందుకే పవన్ ని కలిసి కథ చెప్పాలని చాలాసార్లు అనుకొన్నారు. ఎట్టకేలకు పవన్ ని కలవడం, కథ చెప్పడం జరిగిపోయాయి.
అయితే.. పవన్ సున్నితంగా ఈ ప్రపోజల్ తిరస్కరించారని టాక్. కొరటాల చెప్పిన కథ పవన్‌కు నచ్చలేదా? లేదంటే చేతిలో ఉన్న కమిట్మెంట్స్ వల్ల పవన్ ఈసినిమా చేయలేకపోతున్నాడా? అనేది తెలియాల్సివుంది. మొత్తానికి కొరటాల శివ నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. టాప్ హీరోలంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ హీరోలతో కొరటాల సినిమా చేసే ఛాన్స్ లేదు. ఆయన కథలు స్టార్ హీరోలకే సూటవుతాయి. స్టార్ హీరో దొరకాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. లేదంటే తమిళ, మలయాళ స్టార్ల దగ్గరకు వెళ్లాలి. అంతకంటే ఆయన దగ్గర ఆప్షన్ లేదు.
