ప‌వ‌న్ స్క్రీన్ టైమ్ 50 నిమిషాలే!

ప‌వన్ కల్యాణ్ `వ‌కీల్ సాబ్`పై అంద‌రి దృష్టీ ప‌డింది. ఈనెల 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకున్న హైప్ ని బ‌ట్టి చూస్తే, సినిమా ఎలా ఉన్నా, తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వ‌సూళ్లు అందుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమా నిడివి గురించి ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి. సినిమా లెంగ్తీగా ఉంద‌ని, ఈ విష‌యంలోనే చిత్ర‌బృందం టెన్ష‌న్ ప‌డుతుంద‌ని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా నిడివి 2 గంట‌ల 30 నిమిషాలుగా తేలింది. స్టార్ హీరో సినిమా ఈమాత్రం నిడివి ఉంటే పెద్ద ఇబ్బందులేం ఉండ‌వు.

ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ స్క్కీన్ టైమ్ పై కూడా ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. సినిమా మొత్త‌మ్మీద ప‌వ‌న్ ఎంత సేపు క‌నిపిస్తాడ‌న్న‌ది ఆస‌క్తి క‌లిగిస్తోంది. ఎట్ట‌కేల‌కు తేలిందేంటంటే.. ఈ సినిమాలో ప‌వ‌న్ స్క్రీన్ టైమ్ 50 నిమిషాల లోపేన‌ట‌. ఇది ముగ్గురు అమ్మాయిల క‌థ‌. ఎక్కువ భాగం వాళ్ల చుట్టూనే న‌డుస్తుంది. `పింక్‌`లోనూ అంతే. అమితాబ్ సినిమా ప్రారంభ‌మైన చాలాసేప‌టి వ‌ర‌కూ రాడు. అయితే `వ‌కీల్ సాబ్‌`లో ప‌వ‌న్ కోసం కొన్ని కొత్త సీన్లు రాసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్‌, అందులో ఓ పాట‌, ఫైటూ అంటూ ఆ పాత్ర నిడివి పెంచారు. కాబ‌ట్టే.. స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుంద‌ని భావించారంతా. అయితే.. ఇన్ సైడ్ వ‌ర్గాల రిపోర్ట్ ప్ర‌కారం.. ప‌వ‌న్ కేవ‌లం 50 నిమిషాలే క‌నిపించ‌బోతున్నాడ‌ని తేలింది. అయితే… ప‌వ‌న్ క‌ల్యాణ్ తెర‌పైకొచ్చిన‌ప్పుడ‌ల్లా… ఆయ‌న అభిమానుల‌కు పూన‌కాలు తెచ్చేలా సీన్స్ ఉంటాయ‌ని, ముఖ్యంగా ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్‌, ఫ్లాష్ బ్యాక్ స‌న్నివేశం, ఫైట్లూ… ఫ్యాన్స్‌కి న‌చ్చేలా ఉంటాయ‌ని స‌మాచారం. ఈ సినిమా కోసం ప‌వ‌న్ 50 కోట్ల పారితోషికం తీసుకున్నాడ‌ని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. 50 నిమిషాల కోసం 50 కోట్లంటే.. నిమిషానికి కోటి రూపాయ‌ల‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close