ఐటీ, పోలీస్ ఎవరికైనా టీడీపీ నేతలే టార్గెట్..! ఈ సారి సీఎం రమేష్‌ ఇంటిపై..!

కడప జిల్లా పొట్లదుర్తిలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ ఇంటిపై… పారామిలటరీ బలగాల సాయంతో… పోలీసులు దాడులు చేశారు. ఉదయం ఆరు గంటలకు.. యాభై మంది పోలీసులు సీఎం రమేష్ ఇంట్లోకి చొరబడి.. సోదాలు చేశారు. బెడ్‌రూం సహా.. అన్నింటినీ తనిఖీ చేసి.. వెళ్లిపోయారు. ఇందులో… మరో పాయింట్ కూడా ఉంది.. ఒక్క సీఎం రమేష్ ఇల్లు మాత్రమే కాదు.. పక్కన ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. ఉదయమే బిలబిలమంటూ వచ్చిన పోలీసులను చూసి.. సీఎం రమేష్ ఆశ్చర్యపోయారు. దేని కోసం సెర్చ్ చేస్తున్నారు.. వారెంట్ ఉందా.. అంటే.. ఏమీ లేదని… కోడ్ ఉన్నందున.. వారెంట్ అవసరం లేదని.. ఎస్పీ ఆదేశించారని… పోలీసులు చెప్పి సోదాలు కొనసాగించారు.

మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌ ఇంటిపై ఐటీ అధికారులు రెండు రోజుల కిందట దాడులు చేశారు. ఆ సమయంలో… వారితో సీఎం రమేష్ వాగ్వాదానికి దిగారు. ఎన్నికలపై అభ్యర్థులపై దాడులు చేయడమేమిటని ఆయన నిలదీశారు. దాంతో.. పై స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా దాడులు చేయాల్సి వస్తోందని చెప్పి.. ఐటీ అధికారులు వెళ్లిపోయారు. ఈ క్రమంలో సీఎం రమేష్ ఇంటిపైకి పోలీసులు వచ్చారు. అయితే.. మొదట ఐటీ అధికారులని.. పోలీసులకు మీడియాకు సమాచారం ఇచ్చారు. తాము బందోబస్తుకు వచ్చినట్లు.. మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ వచ్చి సోదాలు చేసింది పోలీసులు మాత్రమే… ఐటీ అధికారులు లేరు.

కొద్ది రోజుల కిందట.. కడప జిల్లా ఎస్పీని ఎన్నికల సంఘం మార్చింది. ఎందుకు మార్చిందో కారణాలు చెప్పలేదు కానీ… వైసీపీ ఒత్తిడి వల్లే అన్న విషయం మాత్రం … బయటకు వచ్చింది. బదిలీలకు కారణాలు చెప్పాల్సిన పని లేదని ఈసీ సమర్థించుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడే… ఈ బదిలీ జరగడం… విజయసాయిరెడ్డి సూచన మేరకే… అభిషేక్ మహంతిని… ఎస్పీని ఈసీ నియమించిందనే ప్రచారం జరగడంతో… టీడీపీ వర్గాలు.. అంతా వైసీపీనే చేయిస్తోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కడప ఎస్పీగా నియమించాలంటూ.. ముగ్గురు పేర్లతో ఏపీ ప్రభుత్వం ఓ రిపోర్ట్ పంపినా.. ఆ ముగ్గురినీ కాదని.. ఈసీ సొంత నిర్ణయంతో అభిషేక్ మహంతిని ఎస్పీగా నియమించింది. ఈ క్రమంలో కడపలో.. టీడీపీ నేతలు టార్గెట్‌గా… వ్యవహారాలు సాగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close