తగ్గినా .. ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్‌లోనే మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా అందరూ సీఎం జగన్‌కు ధ్యాంక్స్ చెప్పారు. అంత కంటే ఎక్కువగా చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. రాజమౌళి అయితే ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే అని డిక్లేర్ చేశారు. ఏపీ ప్రభుత్వ అధిపతి తీసుకున్న నిర్ణయాలతో ఇండస్ట్రీ కుదేలైపోయింది. ఇప్పుడు ఆయన నిర్ణయాలే మళ్లీ నిలబెట్టాలి కాబట్టి సీఎంకు ధ్యాంక్స్ చెప్పారనుకున్నా.. చిరంజీవిని అందరూ ఎందుకంత పొగిడారు ?. ఈ విషయం తరవాత ప్రభుత్వం విడుదల చేసిన వీడియోతో స్పష్టమయింది.

జగన్‌ను చిరంజీవి వేడుకున్న వీడియో రిలీజ్ చేసిన ప్రభుత్వం !

ముఖ్యమంత్రి సమావేశాలు ఎప్పుడూ ప్రత్యక్ష ప్రసారం చేయరు. చివరికి ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎడిట్ చేసి విడుదల చేస్తారు. అధికారిక సమీక్షల్లో అయినా అంతే. గురువారం సినిమా వాళ్ల మీటింగ్ తర్వాత కూడా అలాగే విడుదల చేశారు. ఇలా విడుదల చేసిన వీడియో సీఎం జగన్ ప్రసంగంలో చాలా కట్స్ ఉన్నాయి. అలాగే సినిమా వాళ్ల మాటలు కూడా. కానీ కావానే రిలీజ్ చేసినట్లుగా సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలంటూ చిరంజీవి వేడుకుంటున్న దృశ్యాలు కూడా ఉన్న వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. నిజానికి కట్ చేయాల్సింది. ఎందుకంటే సినీ పరిశ్రమ మెగాస్టార్ వచ్చి అలా ముఖ్యమంత్రిని వేడుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ సమయంలో సీఎం జగన్ హావభావాలు కూడా హైలెట్ అయ్యాయి. అలా ఎందుకు జరిగిందన్నది వేర విషయం.

“మెగాస్టార్‌”ను చేసిన ఇండస్ట్రీ కోసం తగ్గిన చిరంజీవి !

ఇతర అంశాలను పక్కన పెడితే చిరంజీవి ఎందుకు అంత తగ్గిపోయారన్న భావన ఆయన అభిమానుల్లో ఏర్పడింది. సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు వల్ల.. బెనిఫిట్ షోలు వేసే అనుమతి ఇవ్వకపోవడం వల్ల చిరంజీవికి జరిగే నష్టం స్వల్పం. చాలా స్వల్పం. అంత నష్టానికే ఆయన అంతతగా తగ్గి చేతులు జోడించి వేడుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి తన గురించి ఆలోచించలేదు. తనను మెగాస్టార్ చేసిన ఇండస్ట్రీ భవిష్యత్ గురించే ఆలోచించారు. లైన్‌లో ఉన్న పెద్ద సినిమాలపై ఆర్థికంగా దెబ్బపడితే మొత్తం ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడుతుందని… అదే జరిగితే వేల మంది కార్మికులు రోడ్డున పడతారని ఆయన భావించారు. అందుకే తనను తాను తగ్గించుకోవడానికి కూడా వెనుకాడలేదు. బహుశా తాను “తగ్గి చేస్తున్న వేడుకోళ్లు” బయట ప్రపంచానికి తెలియదు అని అనుకుని ఉంటారు. కానీ అలాంటి అమాయకత్వం వల్లే ఆయన రాజకీయంగా ఫెయిలయ్యారు.

తనను తాను తక్కువ చేసుకున్నా వ్యక్తిత్వంలో మహోన్నతంగా ఎదిగిన చిరంజీవి !

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారన్న తర్వాత చాలా ప్రచారాలు జరిగాయి. ఆయన ఇంటిని లైబ్రరీ కోసం ఇవ్వలేదని.. రూ. రెండు లక్షలకు అమ్ముకున్నారని.. పిల్లికి బిచ్చం పెట్టరని ఇలా అనేక ప్రచారాలతో ఇమేజ్ డ్యామేజ్ చేశారు. కానీ చిరంజీవి మంచితనం ఏమిటో ఆయన ఫ్యాన్స్‌కు తెలుసు. ఇప్పుడు అందరికీ తెలిసేలా సీఎం జగన్‌తో టాలీవుడ్ మీటింగ్ జరిగింది. ఆ దృశ్యాలు బయటకు రావడం వల్ల చిరంజీవి తన కోసం కాదు తన చుట్టూ ఉన్న వారి కోసం తనను తాను తగ్గించుకోవడానికి వెనుకాడరన్న విషయం వెల్లడయింది. సీఎం జగన్‌కు ఆయన వేడుకోళ్లు ఫ్యాన్స్‌కు ఆవేదన కలిగించి ఉండవచ్చు కానీ ఆయన వ్యక్తిత్వం మాత్రం అందరి ముందు స్వచ్చంగా ఆవిష్క్రతమయింది .

ఈగో శాటిస్‌ఫేక్షన్ల కోసం అధికారాన్ని ప్రయోగించడం ఎప్పటికైనా ప్రమాదకరమే !

ప్రజాస్వామ్యంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వస్తూటాయి.. పోతూంటాయి. ఏదైనా ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వమే. అంది ముఖ్యమంత్రి స్థానంలోనో ప్రధానమంత్రి స్థానంలోనే ఉన్న వారి స్వయం కృషి కానే కాదు. ఇప్పుడు అధికారం ఇచ్చిన ప్రజలు రేపు లాగేస్తారు. ఎల్లకాలం అధికారం కట్టబెట్టిన చరిత్ర .. చరిత్రలో లేదు. దీన్ని తెలుసుకోకుండా ఈగో శాటిస్‌ఫేక్షన్ కోసం పని చేస్తే ప్రజల్లో ఇమేజ్ చులకనవుతుంది. ఎవరయితే బాధితులవుతారో వారికి మరింత హీరోయిజం లభిస్తుంది. అది ఇప్పుడు చిరంజీవికి లభిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close