ప్రొ.నాగేశ్వర్ : కవాతుతో పవన్ కల్యాణ్ ఏం చెప్పదల్చుకున్నారు..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజమండ్రిలోని ధవళేశ్వరం వంతెన వద్ద బలప్రదర్శన చేశారు. కవాతు నిర్వహించారు. అచ్చంగా రాజకీయ కవాతు నిర్వహించారు. ఇలా ఎందుకు నిర్వహించారనే విశ్లేషిస్తే… గోదావరి జిల్లాలకు ఉన్న రాజకీయ ప్రాధాన్యతను గుర్తించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా.. గోదావరి జిల్లాల్లో ఎవరు గెలిస్తే.. వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సహజంగా జరుగుతోంది. రాజకీయ చైతన్యం జిల్లాలే కాకుండా.. సంఖ్యాపరంగా కూడా.. అత్యధిక నియోజకవర్గాలు ఉన్నా జిల్లాలు. ఈ రెండు జిల్లాల్లో కలిపి 34 నియోజకవర్గాలున్నాయి.

కవాతుతో టీడీపీ, వైసీపీలను సవాల్ చేశారా..?

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో …175 నియోజకవర్గాలు ఉంటే.. ఈ రెండు జిల్లాల్లోనే 34 నియోజకవర్గాలున్నాయి. అంటే.. 20 శాతం సీట్లు ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. అంటే.. అధికారం తెచ్చుకోవాలన్నా… అధికారం పొందాలన్నా.. గోదావరి జిల్లాల ప్రజల తీర్పు కీలకం అవుతుంది. 2014 ఎన్నికల్లో మనం చూస్తే.. రెండు జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో 28 సీట్లు.. టీడీపీ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. అంటే.. టీడీపీకి అధికారం కట్టబెట్టినవి జిల్లాలు ఇవి. ఈ గోదావరి జిల్లాల్లో… ఇంత స్టన్నింగ్ విక్టరీ.. టీడీపీ, బీజేపీ కూటమికి రావడం.. టీడీపీకి ఉన్న బలంతో పాటు.. పవన్ కల్యాణ్ సపోర్ట్ కూడా పని చేసింది. పవన్ కల్యాణ్ అప్పట్లో గోదావరి జిల్లాల్లో ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ కు ఇన్ ప్లూయన్స్ ఉన్న ప్రాంతం కూడా.. కావడం.. టీడీపీ – బీజేపీకి కలసి వచ్చింది. అందుకే.. ఎక్కడైతే.. గత ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ విజయానికి కారణం అయ్యానో.. అక్కడే.. తెలుగుదేశం పార్టీ పరాజయానికి తాను కావాలనుకుంటున్నానని సవాల్ చేయడమే… పవన్ కల్యాణ్ కవాతు వ్యూహం అయి ఉంటుంది.

తన బలాన్ని ప్రదర్శించగలిగారా..?

2014 ఎన్నికల్లో ఏ టీడీపీకి మద్దతుగా నిలిచారో.. ఇప్పుడు అదే టీడీపీకి వ్యతిరేకంగా… తన ప్రభావాన్ని చూపించాడానికి…కవాతును ఉపయోగించుకున్నారు. మరోకటి ఏమిటంటే… డ్రోమ్ కెమెరా దృశ్యాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… పాదయాత్ర రాజమండ్రి రోడ్ కం రైలు వంతెన మీద నుంచి వెళ్లినప్పుడు పెద్ద ఎత్తున జనమీకరణ చేశారు. వాటిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. జగన్‌కు జన ప్రభంజనం ఉందని చెప్పుకునేందుకు జగన్ మీడియా ఇప్పటికీ ఆ దృశ్యాలను విరివిగా వాడుకుంటూ ఉంటుంది. ఓ రాజకీయ ప్రతిష్టను పెంచుకునేలా ఓ.. విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకునేందుకు వాడుకుంటోంది. మీడియా పవర్ ఫుల్ అయింది ఇప్పుడు… ఒక వంద ఉపన్యాసాలు.. వేయి వ్యాసాలు చూపలేని దాన్ని ఒక్క దృశ్యం చూపిస్తుంది. అలాంటి ఇంపాక్ట్‌ను… జగన్ పాదయాత్ర ద్వారా… రోడ్ కం రైలు వంతెన పై చూపారు కనుక.. తాను కూడా అలాంటి ఇంపాక్ట్ చూపిస్తే… రాజకీయ బలం ప్రదర్శించినట్లు అవుతుందని.. పవన్ కల్యాణ్ భావించారు. టీడీపీ, వైసీపీలను సవాల్ చేస్తున్న పవన్ కల్యాణ్… గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఉన్న ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ… జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను తలదన్నేలా.. తన బలం చూపాలన్నది… పవన్ కల్యాణ్ కవాతులో ఉన్న కీలక అంశం.

సామాజికవర్గంలో పట్టు ఉందని నిరూపించారా..?

ఇక మూడోది ఏమిటంటే… తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సామాజిక సమీకరణాలు కూడా కీలకమే. ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో కాపులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఎంత కాదన్నా… రాజకీయాలకు, కులానికి మధ్య అవినావభావ సంబంధం ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా… టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య మూడు ప్రధాన కులాలు వ్యవస్థీకృతమవుతున్నాయి. అయితే ఆ కులాల వాళ్లందరూ.. ఆయా పార్టీలకు ఓటేస్తారని చెప్పడంలేదు. కానీ.. కచ్చితంగా మెజార్టీ ప్రజలు ఆయా పార్టీల వైపు ఉంటారు. అలా అని పవన్ కల్యాణ్ తన కులానికే ప్రాతనిధ్యం వహిస్తున్నాడని చెప్పడం లేదు. కానీ.. అదే సమయంలోనే… తన సామాజికవర్గం వ్యవస్థీకృతమైన అవకాశం ఉంది. అందుకే.. మొబిలైజేషన్ చేసుకునే ప్రయత్నాన్ని కవాతు ద్వారా చేశారు.

సీరియస్ రాజకీయ నేతనని క్లారిటీ ఇచ్చారా..?

కాపు రిజర్వేషన్ల ఇష్యూ వచ్చింది. కాపు ఉద్యామాలు అక్కడే జరిగాయి. కాపు రిజర్వేషన్ అంశం కూడా.. అక్కడ కీలకంగా మారింది. జగన్ కూడా.. కాపు రిజర్వేషన్ల అంశంలో రకరకాలుగా మాట్లాడారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే.. పవన్ కల్యాణ్‌కు సామాజిక వర్గ పరంగా బలపడే అవకాశం ఉన్న ప్రాంతం. అందుకే.. తన కవాతు ద్వారా.. ఓ బలమైన సందేశాన్ని పవన్ కల్యాణ్.. రాజకీయవర్గాల్లోకి పంపగలిగారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ రాజకీయాలు చేశారు. ఆయనకు రాజకీయ సామర్థ్యం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్లను చేర్చుకోవడంతో పాటు… ఇలాంటి కవాతుల ద్వారా తానో సీరియస్ పొలిటికల్ ప్లేయర్‌నని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.