ప్రొ.నాగేశ్వర్ : తెలంగాణ సర్వేలు ఏం చెబుతున్నాయి..?

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల హడావుడి తారస్థాయిలో ఉంది. రోజుకో సర్వే వెలుగు చూస్తోంది. తాను మూడు నెలలకో సర్వే చేయించి ఎన్నికలకు వెళ్తున్నట్లు.. కేసీఆర్ కూడా ప్రకటించారు. అదే సమయంలో.. ఇతర సంస్థలు చేస్తున్న సర్వేలు కూడా పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నాయి. వాటిలోకూడా.. టీఆర్ఎస్ గెలుస్తుందని ఫలితాలు ప్రకటిస్తున్నారు. వీటిలో కొన్ని కొత్త సంస్థలు.. ఉంటే.. మరిన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి. వేర్వేరు సర్వేల్లో కొన్ని సార్లు వేర్వేలు ఫలితాలొస్తున్నాయి. సీ ఓటర్ సర్వేలో మూడురాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని వస్తే.. మరో సర్వేలో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లలో బీజేపీనే గెలుస్తుందని ఫలితం ప్రకటించారు.

సర్వేలను రాజకీయ అవగాహనతోనే పోల్చుకోవాలా..?

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. రాకపోయినా.. సర్వేలు తరచూ వెలువడుతూనే ఉన్నాయి. ఈ సర్వేల సాధికారిత.. ఆయా సంస్థల క్రెడిబులిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో… మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని సర్వే చేస్తున్నారా లేదా అన్నదానిపై కూడా ఉంటుంది. ఇదే మొదటి అంశం. ఏ సర్వే ఫలితాలల్లో అయినా…. టీఆర్ఎస్ ఓడుతుందని చెప్పినా… గెలుస్తుందని.. చెప్పినా… మనకు ఉన్న రాజకీయ అవగాహనతో చూడాలే తప్ప…. సర్వేలే సర్వస్వం అనుకునే వైఖరి కరెక్ట్ కాదు. కేసీఆర్.. కొన్ని సంక్షేమ పథకాల ద్వారా కేసీఆర్ ఓ ఓటుబ్యాంక్‌ను క్రియేట్ చేసుకోగలిగారు. ఎకరం పొలం ఉన్న రైతుకు… పెట్టుబడి సాయంతో పాటు… పెన్షన్ లాంటిసంక్షేమ పథకాలు కూడా అందుతున్నారు. దాంతో వారు కేసీఆర్‌కే ఓటేస్తామని చెబుతున్నారు. అలాగే.. పథకాలు లబ్దిదారులు కాని వారు.. కూడా.. కేసీఆర్ బాగా చేస్తున్నాడట.. కదా అని జరుగుతున్న ప్రచారంతో కేసీఆర్ వైపు ఆకర్షితులవుతున్నారు. అంటే… క్లియర్‌గా అర్థమవుతున్నదేమిటంటే… ఓటు బ్యాంక్ తీరు స్పష్టం అవుతోంది. కేసీఆర్‌ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన వారు.. వారంతా.. ఓ ఓటు బ్యాంక్‌గా క్రియేటయ్యారు.

కేసీఆర్ వ్యతిరేక వర్గమూ బలంగానే ఉందా..?

ఇత సెక్షన్లలో అనేక ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలు ఎందుకు ఉన్నాయంటే.. తెలంగాణ వస్తే.. మొత్తం మారిపోతుందని… అద్భుతం జరిగిపోతుందని… ఆశించారు. కానీ.. అలాంటి పరిస్థితులేమీ కనిపించడం లేదు. అంచనాలు ఎక్కువగా ఉన్నప్పుడు… అందుకోవడం సాధ్యం కాదు. తెలంగాణ వస్తే.. ఏదో అద్భుతం జరిగిపోతుందని.. ప్రజలు భావించినా .. అలాంటివేమీ లేదు. అదీ కాక… కొన్ని హామీలు కూడా అమలు కాలేదు. ఉదాహరణకు.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, కేజీ టు పీజీ, దళితులకు మూడెకరాల భూమి, ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు ఇంకా పూర్తి కాలేదు. అలాగే.. రైతు బంధు పథకం అందని వారు… ఇలాంటి వారంతా మరో సెక్షన్ ఉంది.

నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..?

ఇక మూడో సెక్షన్ ఉంది. వారంతా యువత. వారంతా నిరుద్యోగులు. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే.. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలొస్తాయని వారంతా ఆశ పడ్డారు. కానీ ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. అందుకే వారిలో వ్యతిరేకత వస్తోంది. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా.. వాటిని లాభం కలిగించే.. రాజకీయ వాతావరణం ఏర్పడకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కర్ణాటకలో.. చాలా సర్వేలు చేశారు. అన్ని సర్వేల్లోనూ.. సిద్ధరామయ్యకు పరిస్థితి అనుకూలంగా ఉంది. ఆయన సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తున్నారని చెప్పుకున్నారు. తెలంగాణలో కర్ణాటకలో కూడా.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. సమర్థంగా అమలు చేశారు. అందుకే.. సిద్ధరామయ్యపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత లేదు. కానీ దాన్ని ఓట్లుగా మల్చుకునే రాజకీయ వాతావరణం మాత్రం అక్కడ ఏర్పడలేదు.

మహాకూటమి కేసీఆర్‌ను ఓడించేంత బలంగా మారుతుందా..?

నేను గతంలో … చాలా సార్లు చెప్పాను. నెల రోజుల్లో.. కేసీఆర్‌ కు ఉన్న అనుకూలత తగ్గిపోతోంది. ఈ లోపు తెలంగాణ మహాకూటమి ఏర్పడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవుతుంది. అయితే ఇది టీఆర్ఎస్‌ను ఓడించే అవుతుందా లేదా అన్నది చెప్పలేం. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా అయినా మారిపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.