జగన్‌ ఫెయిల్యూర్‌ : వెళ్లడానికే గొట్టిపాటి రెడీ!

‘క్విట్‌ వైకాపా’ ఉద్యమం చాలా ఉధృతస్థాయిలో జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. పైగా తన పార్టీనుంచి తెలుగుదేశంలోకి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల విషయంలో ఏదో తన కోపాన్ని అసంతృప్తిని ప్రకటించడం మినహా.. వారిని బుజ్జగించడానికి గానీ, తన పార్టీలోనే కట్టుగా ఉంచుకోవడానికి గానీ.. వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి స్వయంగా ప్రయత్నాలు చేయడమూ లేదు, అంతో ఇంతో ఒకరిద్దరితో చేస్తున్నా, ఏమీ పెద్దగా ఫలితం ఇస్తున్నట్లుగానూ లేదు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తెలుగుదేశంలో చేరిపోవడానికి ముహూర్తం 27గా నిర్ణయించుకోవడం, అదే రోజున కర్నూలు జిల్లా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా చేరుతారనే ప్రచారం చర్చనీయాంశంగా ఉన్నాయి.

గొట్టిపాటి రవికుమార్‌ విషయంలో ఆయన పార్టీ ఫిరాయించే పరిస్థితి రావడానికి జగన్మోహనరెడ్డి ఫెయిల్యూర్స్‌ చాలా ఉన్నాయంటూ వైకాపాలోని కొందరు నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్‌ కొద్దిగా ప్రయత్నించి ఉంటే.. ఆ ఫిరాయింపును ఆపి ఉండవచ్చుననేది వారి వాదన. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా భూమా నాగిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే.. ఆ పదవి తనకు కావాలంటూ గొట్టిపాటి రవికుమార్‌ జగన్‌ను కోరారు. ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉండే పీఏసీ ఛైర్మన్‌ పదవి ఇవ్వకపోతే తెదేపాలోకి వెళ్తా అనే.. సంకేతాలు కూడా ఆయన పంపారు.

కానీ జగన్‌ పట్టించుకోలేదు. పీఏసీ పదవిని మరొకరి చేతుల్లో పెట్టారు. పీఏసీ పదవి అసంతృప్తితోనే జ్యోతుల వంటి వారు కూడా వెళ్లిపోయిన సంగతి అందరికీ గుర్తుంటుంది. అదే అసంతృప్తి గొట్టిపాటిలో కూడా ఉంది. ఆ తర్వాత కూడా గొట్టిపాటి జగన్‌తో ఓసారి సమావేశం అయ్యారు. బహుశా అది జగన్‌ తరఫు నుంచి బుజ్జగింపు సమావేశం అయి ఉంటుందని అంతా భావించారు. అయితే తాజా పరిణామాల దృష్ట్యా చూస్తే.. జగన్‌ బుజ్జగింపులు ఏమీ ఫలించినట్లు లేదు. జగన్‌ ఫెయిల్యూర్‌ దెబ్బకు గొట్టిపాటి రవికుమార్‌ తెదేపాలోకి వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. ఆయన వెళ్లేరోజునే బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా చేరుతారని అంటున్నారు. విశాఖకు చెందిన ఎమ్మెల్యే, మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా క్యూలైన్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అవన్నీ ఎప్పటికి తేలుతాయో వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close