ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసింది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికను ఎన్డీఏ పార్టీలు బీజేపీకి వదిలేశాయి. 21వ తేదీన సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇండీ కూటమి అభ్యర్థిని నిలబెడితే పోటీ జరుగుతుంది. లేకపోతే ఏకగ్రీవం అవుతుంది.
చెల్లమ్మల్ పలనిస్వామి రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు . తమిళనాడుకు చెందిన వారు. 1970లలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో చేరారు. 1996లో BJPలో చేరి, తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేశారు. కోయంబతూర్ నుంచి రెండుసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. కొంత కాలం తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.
NDAకు పార్లమెంట్లో మెజారిటీ 426 ఓట్లు ఉండటంతో ఆయన గెలుపు ఖాయమే. ఆయనకు రాజ్యాంగపరమైన అనుభవం, దక్షిణ భారతదేశంలో BJPను బలోపేతం చేసే సామర్థ్యం, , RSS బ్యాక్‌గ్రౌండ్ కలసి వచ్చాయి. తమిళనాడులో BJPకు మేలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.