రాఘ‌వేంద్రుడి సినిమా ఫిక్స్‌

`ఓం న‌మో వేంక‌టేశ‌` త‌ర‌వాత సినిమా ఏదీ ప‌ట్టాలెక్కించ‌లేదు రాఘ‌వేంద్ర‌రావు. లాక్ డౌన్‌కి ముందు ఓ ప్రాజెక్టు అనుకున్నారు. కానీ… ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టే పట్టాలెక్కించ‌బోతున్నారు. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రేపు ఉద‌యం రాబోతోంది. న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని తెలియ‌జేయ‌నున్నారు. స్టార్లెవ‌రూ ఈ సినిమాలో ఉండ‌క‌పోవొచ్చు. దాదాపు అంతా కొత్త‌వారితో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. స్క్రిప్టు ఇప్ప‌టికే సిద్ధ‌మైపోయింది. `పెళ్లి సంద‌డి` టైపులో చిన్న సినిమా ఇది. ఎప్ప‌టిలానే సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వ‌బోతున్నారు. రాఘ‌వేంద్ర‌రావు నిర్మాణ‌, ద‌ర్శ‌క‌త్వ సార‌ధ్యంలో ఓ సినిమా కూడా మొద‌ల‌వ్వ‌బోతోంది. నాలుగు గొలుసు క‌థ‌ల స‌మాహారం ఈ సినిమా. దానికి సంబంధించిన డీటైల్స్ కూడా త్వ‌ర‌లో చెప్పే అవ‌కాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close