కోదండ‌రామ్ కి రాహుల్ ఆఫీస్ నుంచి ఆహ్వానం..!

మ‌హా కూట‌మి పార్టీల మ‌ధ్య సీట్ల పంపకాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్న నేప‌థ్యంలో… తెలంగాణ జ‌న స‌మితికి ఢిల్లీ కాంగ్రెస్ నుంచి ఆహ్వానం వ‌చ్చిన‌ట్టు స‌మాచారం! ఎందుకంటే, కూట‌మి పార్టీల సీట్ల పంప‌కాల వ్య‌వ‌హారంలో మొద‌ట్నుంచీ కోదండ‌రామ్ పార్టీయే కొంత ప‌ట్టుద‌ల‌తో ఉన్న మాట వాస్త‌వ‌మే. ఓర‌కంగా టీడీపీతో కంటే, జ‌న స‌మితి వ్య‌వ‌హార‌మే కాంగ్రెస్ కి కొంత త‌ల‌నొప్పిగా ఉంటూ వ‌స్తోంద‌ని చెప్పొచ్చు. అయితే, 14 సీట్ల‌తో టీడీపీతో ఒప్పందం కుదిరిపోయింది కాబ‌ట్టి… ఇక‌, కోదండ‌రామ్ తో నేరుగా కాంగ్రెస్ హై క‌మాండ్ చ‌ర్చిస్తేనే మంచిద‌నే ప్ర‌తిపాద‌న పీసీసీ నుంచి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

జ‌న స‌మితి ప్ర‌స్తుతం అడుగుతున్న సీట్లు 15. కానీ, కాంగ్రెస్ ఆ పార్టీకి 8 సీట్లు మాత్ర‌మే ఇస్తామ‌ని అంటోంది. ఈ బేర‌సారాల నేప‌థ్యంలో 12 సీట్ల కంటే త‌క్కువ అయితే ఒప్పుకునేది లేద‌నేది కోదండ‌రామ్ ప‌ట్టుద‌ల‌గా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ కార్యాల‌యం నుంచి కోదండ‌రామ్ కి ఆహ్వానం పంపిన‌ట్టు తెలుస్తోంది. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు రాహ‌ల్ తో ఆయ‌న భేటీ ఉంటుంది. ఈ భేటీలో కోదండ‌రామ్ ని 8 లేదా 9 సీట్ల‌కు ఒప్పించాల‌న్న‌ది కాంగ్రెస్ వ్యూహం. అంతేకాదు, తెలంగాణ‌లో మ‌హాకూట‌మి అధికారంలోకి వ‌స్తే… కోదండ‌రామ్ పాత్ర మ‌రింత క్రియాశీలంగా ఉంటుంద‌నే హామీని రాహుల్ ద్వారా ఇప్పించే అవ‌కాశం ఉంది.

జ‌న స‌మితి విష‌యంలో ఇంత క‌స‌ర‌త్తు ఎందుకు చేస్తోందంటే.. కోదండ‌రామ్ అడుగుతున్న‌ట్టుగా 15 స్థానాలు ఇస్తే… కొన్ని స్థానాల్లో తెరాస‌కు అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌నేది కాంగ్రెస్ అభిప్రాయం. కాబ‌ట్టి, ప‌ట్టువిడుపు ధోర‌ణికి ఇక్కడ ఆస్కారం లేని పరిస్థితి ఉందని కొందరు నేత‌లు అంటున్నారు. ఇంకోటి.. కోదండ‌రామ్ కి తెలంగాణ స‌మాజంలో మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి… నేరుగా రాహుల్ తో మాట్లాడించ‌డం ద్వారా ఆ పార్టీకి కాంగ్రెస్ ఎంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌నే సంకేతాలు కూడా వెళ్తాయ‌నేది వారి ఆలోచ‌న‌. మొత్తానికి, వ్య‌వ‌హారం రాహుల్ తో భేటీ వ‌ర‌కూ వ‌చ్చింది కాబ‌ట్టి, జ‌న స‌మితి సీట్ల కేటాయింపు కూడా దాదాపు ఒక కొలీక్కి వ‌చ్చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన వ్యూహం మరొకటి ఉంది. కాంగ్రెస్ 95లో పోటీ చేసేయ‌డం ఖాయ‌మ‌నీ, టీడీపీకి 14 ఇస్తున్నామ‌నీ ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించేసింది. అంటే, మొత్తం 119 స్థానాల‌కుగానూ 109 సీట్ల‌పై ఒక స్ప‌ష్ట‌త ఇచ్చేసిన‌ట్టే. మిగిలిన‌వి 10 మాత్ర‌మే. వీటిలోనే జ‌న స‌మితి, సీపీఐలు స‌ర్దుబాటు చేసుకోవాల‌నే ఒక అప్ర‌క‌టిత అభిప్రాయాన్ని రాహుల్ తో చ‌ర్చ‌కు ముందే కోదండ‌రామ్ ముందు కాంగ్రెస్ ఉంచిన‌ట్టే క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close