‘మ‌గ‌ధీర’ స్ట్రాట‌జీ ఫాలో అవుతున్న చ‌ర‌ణ్‌

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ సినిమా ఏమిట‌న్న‌ది ఇంకా ఫిక్స్ కాలేదు. కాక‌పోతే చ‌ర‌ణ్ ముందు రెండు ఆప్ష‌న్లున్నాయి. ఓ ఆప్ష‌న్ అయితే.. `జెర్సీ`తో ఆక‌ట్టుకున్న గౌత‌మ్ తిన్న‌నూరి. ఇప్ప‌టికే… ఇద్ద‌రి మ‌ధ్యా ప‌లు మార్లు భేటీ జ‌రిగింది కూడా. యూవీ క్రియేష‌న్స్ సంస్థ ఇది వ‌ర‌కే.. గౌత‌మ్ కి అడ్వాన్స్ ఇచ్చింది. ఈ క‌థ గ‌నుక ఓకే అయితే… యూవీలోనే చ‌ర‌ణ్ – గౌత‌మ్ ల సినిమా ఉంటుంది.

ఇక రెండో ఆప్ష‌న్‌.. వెంకీ కుడుముల‌. ఛ‌లో, భీష్మ సినిమాల‌తో ఆక‌ట్టుకున్నాడు వెంకీ కుడుముల‌. ఓ స్టార్ హీరోతో సినిమా చేయాల‌న్న‌ది వెంకీ కుడుముల ప్ర‌య‌త్నం. మ‌హేష్ కోసం ఓ క‌థ సిద్ధం చేసుకున్నాడు వెంకీ. కానీ.. కుద‌ర్లేదు. ఇప్పుడు చ‌ర‌ణ్‌తోనూ ట‌చ్‌లో ఉంటున్నాడు. రెండు క‌థ‌లూ.. చ‌ర‌ణ్‌కి బాగా న‌చ్చాయ‌ని, ఇందులో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. `ఆర్‌.ఆర్‌.ఆర్` త‌ర‌వాత‌.. బ‌డా ద‌ర్శ‌కుల‌తో కాకుండా.. యువ‌త‌రంతో ప‌ని చేయాల‌న్న‌ది చ‌ర‌ణ్ ఉద్దేశం. `మ‌గ‌ధీర‌` త‌ర‌వాత కూడా చ‌ర‌ణ్ అదే చేశాడు. అంచ‌నాలు త‌గ్గించ‌డానికి `ఆరెంజ్‌` అనే ప్రేమ‌క‌థ‌ని ఎంచుకున్నాడు. ఫ‌లితంలో తేడా వ‌చ్చినా.. చ‌రణ్ స్ట్రాట‌జీ మాత్రం స‌రైన‌దే. ఇప్పుడు కూడా చ‌ర‌ణ్ అదే బాట‌లో న‌డ‌వ‌బోతున్నాడు. కాక‌పోతే.. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌లో ఎవ‌రికి ల‌క్కీ ఛాన్స్ దక్కుతుంద‌న్న‌ది మాత్రం స‌స్పెన్స్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష‌… ద‌స‌రా.. బ‌చ్చ‌ల మ‌ల్లి!

హీరోలు ఈమ‌ధ్య మేకొవ‌ర్‌ల‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. పుష్ష‌తో బ‌న్నీ, ద‌స‌రాతో నాని... త‌మ మేకొవ‌ర్‌తో షాక్ ఇచ్చారు. ఇదివ‌ర‌కెప్పుడూ లేనంత మాస్ పాత్ర‌ల్లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. ఆ రెండు చిత్రాలూ...

కేంద్రంలో ఇండియా కూటమే…రేవంత్ లెక్కలు ఎలాగున్నాయంటే..?

చార్ సౌ పార్ అనే నినాదంతో ఎన్నికల సంగ్రామంలోకి దూకిన బీజేపీ ఈసారి కేంద్రంలో అధికారంలోకి రాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఆ పార్టీ నాలుగు వందల సీట్ల...

ఇర‌కాటంలో ప‌డిన‌ కీర‌వాణి

అందెశ్రీ రాసిన పాట‌ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే ఈ పాట‌ని స్వ‌ర ప‌రిచే అవ‌కాశం కీర‌వాణికి అప్ప‌గించారు. కీర‌వాణి గొప్ప...

ఈసారి యూత్‌ని టార్గెట్ చేసిన గుణ‌శేఖ‌ర్‌

మ‌న‌కున్న క్రియేటీవ్ డైరెక్ట‌ర్ల‌లో గుణ‌శేఖ‌ర్ ఒక‌డు. ఒక్క‌డు, చూడాల‌ని ఉంది లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు ఆయ‌న నుంచే వచ్చాయి. అయితే ఇటీవ‌ల ఆయ‌న చేసిన కొన్ని ప్ర‌యోగాలు బెడ‌సి కొట్టాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close