రామ్ టైటిల్… ‘ఉస్తాద్‌’?

రామ్ క‌థానాయ‌కుడిగా – లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇటీవ‌లే ఈ చిత్రానికి అధికారికంగా క్లాప్ కొట్టారు. ఈవారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇందులో రామ్ పోలీస్ అధికారిక‌గా క‌నిపించ‌నున్నాడ‌న్న విష‌యం తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు..టైటిల్ విష‌యంలోనూ క్లూ లాగింది.

ఈ చిత్రానికి `ఉస్తాద్` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. దాదాపుగా ఇదే ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. రామ్ కెరీర్‌లోనే `ఇస్మార్ట్ శంక‌ర్‌` అతి పెద్ద హిట్టు. అందులో.. రామ్ `ఉస్తాద్ ఇస్మార్ట్ శంక‌ర్‌…` అంటూ త‌న గురించి తాను చెప్పుకుంటాడు. అందులోని ఉస్తాద్ నే ఇప్పుడు టైటిల్ గా మార్చుకున్నాడు రామ్. ఈ సినిమాకి `ఉస్తాద్` అనే టైటిల్ సూచించింది కూడా రామ్ నే అని స‌మాచారం. త్వ‌ర‌లోనే… ఈ టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close