RRR కొత్త షెడ్యూల్ మొద‌లైంది

బాహుబ‌లి త‌ర‌వాత రాజ‌మౌళి మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మ‌య్యాడు. ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. `ఆర్‌.ఆర్‌.ఆర్‌`గా పిలుచుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈరోజు ఉద‌యం.. ఆర్‌.ఆర్‌.ఆర్ రెండో షెడ్యూల్ ప్రారంభ‌మైంది. తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌పై కొన్ని యాక్ష‌న్ దృశ్యాల్ని తెర‌కెక్కించారు. ఆ త‌ర‌వాత కార్తికేయ పెళ్లి కోసం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. సంక్రాంతి పండ‌గ పూర్త‌య్యాక‌… మ‌ళ్లీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈసారి ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌పై కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నారు. ముగ్గురు క‌థానాయిక‌లకు ఈ క‌థ‌లో అవ‌కాశం ఉంది. వాళ్లెవ‌ర‌న్న‌ది ఇంకా తేల‌లేదు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. సింథిల్ కెమెరామెన్‌గా ప‌నిచేస్తున్నారు. 2020లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close