చిరు-క్రిష్ మూవీ…ఇదేదో చిరు-సురేందర్‌రెడ్డి కాంబో డ్రామాలా ఉందే

‘ధృవ సినిమా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి…చిరంజీవి 151వ సినిమాను డైరెక్షన్ చేయనున్నాడు….’. ధృవ సినిమా రిలీజ్ టైం దగ్గరపడినప్పటి నుంచీ…ఆ సినిమా రిలీజ్ అయిన వారం తర్వాత వరకూ కూడా మీడియాలో బాగా ప్రచారం అయిన ఒక న్యూస్ ఇది. ఆ తర్వాత మాత్రం మళ్ళీ ఎక్కడా వినిపించలేదు. ఫ్యూచర్‌లో కూడా చిరంజీవి-సురేందర్‌రెడ్డిల కాంబినేషన్‌లో ప్రాజెక్ట్ ఉండే అవకాశాలైతే చాలా స్వల్పం. ఎందుకంటే చిరంజీవికి వినాయక్, బోయపాటి శ్రీనులాంటి డైరెక్టర్స్ స్టైల్ నచ్చుతుంది. సురేందర్‌రెడ్డితో వ్యవహారం అంటే రిస్క్ ఎక్కువ అని ఇండస్ట్రీలో ఉన్న టాప్ రేంజ్ హీరోల ఫీలింగ్. సురేందర్‌రెడ్డి సినిమాల రిజల్ట్స్ లిస్ట్ చూస్తే కూడా ఆ విషయం అర్థమవుతుంది. ధృవ సినిమాను కూడా మనవాడు ఓ పెద్ద హిట్ రేంజ్‌కి అయితే తీసుకెళ్ళలేకపోయాడు.

ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడిక తాజాగా శాతకర్ణి డైరెక్టర్‌ క్రిష్‌తో చిరంజీవి సినిమా ఉంటుందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే అవకాశాలు తక్కువే. మాస్…ఊర మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న హీరో ప్రస్తుతం ఎవరూ లేరన్నది చిరంజీవి ఆలోచన. చిరంజీవికి స్ట్రాంగ్ బేస్ ఉండేది కూడా అక్కడే. అలాగే పీక్స్‌లో హీయిజం బిల్డప్పులు, హీరో చేసే అన్ని మసాలాలను విపరీతంగా ఇష్టపడేది, నచ్చిన హీరోలను ఆరాధించేది కూడా వాళ్ళే. అందుకే ఆ ప్రేక్షకుల చేత మరోసారి జేజేలు కొట్టించుకోవాలని ఆలోచిస్తున్నాడు మెగాస్టార్. చిరంజీవిలాంటి టాప్ రేంజ్ స్టార్ హీరో సినిమాను ఒక వర్గం ప్రేక్షకులు హిట్ చేశారంటే…..మిగతావాళ్ళందరూ కూడా తప్పకుండా చూస్తారన్నది మెగా క్యాంప్ ఆలోచన. అందుకే ఆ మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించగలిగే బోయపాటి శ్రీనులాంటి డైరెక్టర్స్‌ కోసం మెగా క్యాంప్ ప్లాన్ చేస్తోంది.

గౌతమీ పుత్ర డైరెక్టర్ క్రిష్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే కానీ హీరోయిజం కోసమే అయితే మాత్రం సినిమా తీయడు క్రిష్. తన కథలో హీరో కూడా భాగమవ్వాలనుకుంటాడు. మణిరత్నంలాంటి వాళ్ళ ఆలోచన కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు కూడా గౌతమీ పుత్రుడి వీరోచిత కథ కాబట్టి……ఆ హీరోయిజంకి ఇంప్రెస్ అయ్యి సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు బాలకృష్ణ. అంతకంటే కూడా వందో సినిమా అంటే నరుకుడు సింహాల్లా కాకుండా కాస్త గొప్పగా ఉండాలని కూడా ఆలోచించాడు. మరి ఆల్రెడీ 150వ సినిమాని కంప్లీట్ చేసుకున్న చిరు ఆలోచనలన్నీ కూడా మరోసారి బాక్స్ ఆఫీస్‌ని కొల్లగొట్టే సినిమాలు చేయాలని ఉంటాయి కానీ గొప్ప సినిమా చేయాలన్న ఆలోచన అయితే ఉండదు. మరి ఈ గాసిప్ ఎలా వచ్చింది? మెగా ఫ్యామిలీ పెట్టించిందా? లేక క్రిష్ వైపు నుంచి పుట్టిందా? ఈ గాసిప్‌ని పుట్టించింది క్రిష్ వర్గం వాళ్ళే అన్నది ఇండస్ట్రీ టాక్. ‘ఖబడ్దార్’ డైలాగ్‌తో మెగా వర్గాలను, మెగా ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టిన క్రిష్…ఇప్పుడు పరిహార చర్యలకు దిగాడు. అందులో భాగంగానే శాతకర్ణి, ఖైదీ సినిమాలు రెండూ హీట్ అవ్వాలని కూడా స్వయంగా తనే చెప్పాడు. అంతకంటే కూడా ఇంకా ఏదో చేయాలన్న ఉద్ధేశ్యంతో చిరుతో సినిమా చేస్తానన్న ఫీలర్ వదిలాడు. అంతకుమించి చిరంజీవి-క్రిష్‌ల సినిమా అయితే ఇప్పట్లో ఉండే అవకాశమే లేదు అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close