చైతూ పెద్ద సాహ‌స‌మే చేస్తున్నాడుగా…

రూ.500, రూ.1000 నోట్ల ర‌ద్దు షాక్ నుంచి ఇంకా ఎవ‌రూ తేరుకోలేదు. ఎవ‌రి నోట విన్నా.. ఇదే మాట‌. న‌లుగురు చేరితే ఇదే చ‌ర్చ‌. అంద‌రి చూపూ క‌రెన్సీపై ఉంటే సినిమాని ప‌ట్టించుకొనేదెవ‌రు…? అయితే ఈ ద‌శ‌లో సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా ఈ వారం బాక్సాఫీసు ముందుకు వ‌స్తోంది. నిజానికి ఇది సాహ‌సోపేత‌మైన ఎత్తుగ‌డే. శ‌నివారం రావ‌ల్సిన మ‌రో సినిమా ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం మాత్రం.. క‌రెన్సీ భ‌యంతో వెనుక‌డుగు వేస్తే… సాహ‌సం శ్వాస‌గా సాగిపో మాత్రం పెద్ద సాహ‌స‌మే చేసిన‌ట్టైంది. నిజానికి ఈ సినిమాని కూడా వాయిదా వేద్దామ‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. గురువారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కూ విడుద‌ల విష‌యంలో చిత్ర‌బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డింది. కానీ.. ఆ ఆలోచ‌న విర‌మించుకొంది. దానికి చాలా కార‌ణాలున్నాయి.

ఈ సినిమా ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. న‌వంబ‌రు 11న కూడా రాక‌పోతే.. ఎప్పుడొస్తుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. ఎందుకంటే తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమాని ఒకేసారి విడుద‌ల చేయాల‌నే ఇంత‌కాలం ఆగారు. రెండు చోట్లా ఈ సినిమాకి మంచి డేట్ దొరికింది. న‌వంబ‌రు 11 మిస్ అయితే… మ‌ళ్లీ ఇలాంటి డేట్ దొర‌క‌డం చాలా క‌ష్టం. అందుకే ఏదైతే అది అయ్యిందంటూ చిత్ర‌బృందం రిస్క్ చేయ‌డానికి ముందుకొచ్చింది. అంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమాకి అనుకొన్న స్థాయిలో ఓపెనింగ్స్ వ‌స్తాయా, రాదా? అనేది స‌మ‌స్య‌గా మారింది. సోలో రిలీజ్ కాబ‌ట్టి చైతూకి పోటీ లేదు. కాక‌పోతే.. అంద‌రి దృష్టీ ఇప్పుడు ఏటీఎమ్ సెంట‌ర్ల‌మీదా, బ్యాంకుల మీదా ఉంది. ఈ ద‌శ‌లో టికెట్ కౌంట‌ర్ ద‌గ్గ‌ర క్యూ క‌ట్టే ప‌రిస్థితి ఉందా అనేది అనుమాన‌మే. టికెట్ కౌంట‌ర్ల‌లో రూ.500. రూ.1000 నోట్లు తీసుకోరు. అలాంట‌ప్పుడు చేతికి దొరికిన వంద నోట్ల‌తో టికెట్ కొని, సినిమాని ఎంజాయ్ చేస్తాడా అనేది ఇంకా పెద్ద డౌట్‌. మ‌రి.. చైతూ చేసిన ఈ సాహ‌సానికి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో తెలియాలంటే రేప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలకు గేట్లు క్లోజ్!

ఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే పార్టీ మార్పుపై కొంతమంది టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారా..? ఐదేళ్ళు టీడీపీ నేతలను...

రాజీనామా చేసిన వాలంటీర్ల పెడబొబ్బలు !

తమను మల్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు వెనుకాడటం లేదు. వారి బాధ ఇప్పుడు...

క‌థాక‌మామిషు: ఈవారం క‌థ‌ల‌పై రివ్యూ

క‌థా స్ర‌వంతిలో మ‌రో వారం గ‌డిచిపోయింది. ఈవారం (జూన్ 16) మ‌రి కొన్ని క‌థ‌లు పాఠ‌కుల ముందుకు వ‌చ్చాయి. ర‌చ‌నా శైలి ఎలా ఉన్నా, వ‌స్తువులో వైవిధ్యం క‌నిపించ‌డం మంచి ప‌రిణామం. నాన్న...

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close