సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టు ‘అసుర ఆగమనం” గ్లింప్స్ బయటికి వచ్చింది. డార్క్ అంబీషస్ లో హీరోని ఒక వారియర్ గా పరిచయం చేశారు. ఈ పాత్ర కోసం సాయి ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్, ఇంటెన్స్ ప్రజెన్స్ ఆకట్టుకున్నాయి. డైలాగ్ డెలివరీ కూడా పవర్ ఫుల్ గా వుంది. వెట్రివెల్ పళనిసామి సినిమాటోగ్రఫీ, అజనీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని హైలెట్ చేసింది.
సినిమా పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని గింప్స్ చూస్తే అర్ధమౌతుంది. దర్శకుడు రోహిత్ టేకింగ్ లో బలం కనిపించింది. హనుమాన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో విజువల్ ఫీల్ వున్న సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి వస్తోంది.
ఈ రోజుల్లో ప్రత్యేకంగా వర్క్ బిల్డింగ్ వున్న సినిమాలవైపే జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఆలాంటి అంబీషస్ సంబరాల యేటిగట్టు లో కనిపించింది. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగలిగింది. సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.