టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు చేరితే సాక్షికి అంత అనందమా..?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ.. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌కు కానీ.., ఆయన మీడియా సాక్షి కి కానీ.. నచ్చని ఒకే ఒక్క పదం.. ” పార్టీ ఫిరాయింపులు “. తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడాన్ని సాక్షి పత్రిక ఇప్పటికీ.. ఏ చిన్న అవకాశం దొరికినా… ఎంత రాజ్యాంగ విరుద్ధమో .. వివరిస్తూ.. పుంఖానుపుంఖాలుగా కథనాలు రాసేస్తుంది. గగ్గోలు పెడుతోంది. ఏపీలో రాజ్యాంగం అపహాస్యం పాలవుతోందని… రణం ప్రారంభిస్తుంది. కానీ.. తెలంగాణకు వచ్చే సరికి .. మాత్రం అలాంటి ఫిరాయింపులు.. చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు… తమకు పదవి ఇచ్చిన పార్టీని.. విలీనం చేస్తున్నట్లుగా… మండలి చైర్మన్‌కు లేఖ ఇవ్వడం .. దానికి ముద్ర వేయడాన్ని గొప్ప రాజకీయ వ్యూహంగా చూపించేందుకు ఏ మాత్రం వెనుకాడదు.

ఈ రోజు సాక్షి దినపత్రిక అదే చేసింది. “కాంగ్రెస్ పార్టీ ఖాళీ” అని సంబరంగా.. పత్రిక శీర్షికలో ప్రచురించుకుని మురిసిపోయింది. నిజానికి అసలు సీఎల్పీ మీటింగ్‌ పెట్టకుండానే… తీర్మానం చేసినట్లు… కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తీసుకెళ్లడమే తప్పు. కానీ ఆ విషయాన్ని ఎక్కడా సాక్షి తన కథనాల్లో ప్రచురించలేదు. అసలు ఎలా చట్టబద్దమో.. విశ్లేషించే ప్రయత్నం చేయలేదు. పూర్తిగా టీఆర్ఎస్‌ కు మద్దతుగా కథనాలు ప్రచురించారు. నిజానికి ఈ విషయంలో తప్పు పట్టాల్సినదేమీ లేదు. అది ఆ పత్రిక విధానం అనుకుందాము. కానీ .. ఇదే విధానాన్ని ఏపీలో మాత్రం ఎందుకు అనుసరించదనే అనుమానం చాలా మందికి రావడం సహజమే. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లో చేరినప్పుడు… ఎంత రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందో.. తెలంగాణలో కూడా అదే జరిగింది కదా..? మరి ఇక్కడ.. ఫిరాయింపుల్ని సమర్థిస్తున్నట్లుగా కథనాలు రాయడం ఎందుకు..?

నిజానికి ఇలా టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమిటో.. సాక్షి పత్రిక పాఠకులకు కూడా అర్థం కావడం లేదు. తెలంగాణలో వైసీపీకి ఎలాంటి రాజకీయ ఆసక్తులు లేవు. తటస్థంగా.. జర్నలిజం పవర్ చూపించే అవకాశం అక్కడి జర్నలిస్టులకు ఉంది. కానీ.. వారు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ… ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్న.. టీఆర్ఎస్ తీరును.. సమర్థిస్తూ కథనాలు రాయడమే… అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. తెలంగాణ ఎడిషన్‌ను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారన్న అసంతృప్తి పాఠకుల్లో పెరిగిపోతోంది. ఇది పెద్దదైతే… మనుగడకే ముప్పు వాటిల్లవచ్చు. ఈ విషయంలో తెలంగాణలో అయినా సాక్షి జర్నలిజం ప్రమాణాలను పాటించాలని కోరుకుందాం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close