అల్లు అర్జున్ మాస్.. ఊర మాస్..

అదేంటి అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని అనుకుంటే సడెన్ గా ఇలా ఊర మాస్ అనేస్తున్నారు అని కంగారు పడుతున్నారు కదా.. అయితే మీరు ఇంకా సరైనోడు టీజర్ చూడలేదన్న మాట. కొద్దిగంటల క్రితం రిలీజ్ అయిన ఈ టీజర్ అప్పుడే ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో వెళ్లింది. బోయపాటి టేకింగ్, బన్ని యాక్టింగ్ కలిపి సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అనేంతలా ఈ టీజర్ ఉండింది.

ఎర్ర తోలు కదా స్టైల్ గా ఉంటాడనుకున్నావేమో.. మాస్ ఊర మాస్ అంటూ బన్ని డైలాగ్ చెబుతుంటే మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ఒక్క డైలాగ్ చాలదా సినిమా హిట్ అనడానికి.. బన్నిలోని మాస్ యాంగిల్ ను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసే సినిమా ఈ సరైనోడు తెరకెక్కుతుంది. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రేసాలు కథానాయికలుగా నటిస్తున్నారు. అన్ని హంగులను ముగించుకుని సినిమా ఆడియోను మార్చ్ చివరన.. సినిమాను ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]