సెటైర్: హోదా ఎట్లొస్తది? బొందబెడ్తమనాల

తెలంగాణ పోరుబిడ్డలకేకాదు, ఆడ ఆంధ్రాపోరగాళ్లకు కూడా నాపేరు బాగా ఎర్కనె. మనమేం తక్కువ తిడ్తిమా, మరచిపోవడానికి. అయినా పాతముచ్చట్లు పట్టించుకోకుండా వాళ్లు అమరావతిలో నా మూడు ముక్కల్ని మెచ్చుకున్నరు. నాకూ ముచ్చటేసింది. సరే, బాబు పిల్వగానే ఆడకుపోయ. `నువ్వొచ్చినావ్, అదే సంతోషమం’టూ శిలాఫలకంపై నాపేరు గీకారు. ఈ గీకుల్లూ, లాగుల్లూ- అన్నీ రాజకీయమని నాకెరుకె. అయినా ఊరుకున్న. వేదికపై కూర్చోబెట్టి మాట్లాడమన్నరు. నేనేమీ తెల్వితక్కువోడ్నా, తెలంగాణ పోరుగడ్డపై బోలెడు ముచ్చట్లు గంటలకొద్ది చెప్పెటోడ్ని. కానీ ఆడెందుకు మన ముచ్చట? అవసరంలె.. అందుకె మూడుముక్కల్లో స్పీచ్ ఇచ్చేసా. దీనికే ఆంధ్రోళ్లు తప్పట్లు కొడ్తు ముచ్చటపడ్డరు.మెచ్చుల్లే మెచ్చుల్లు.

ఏమాటకామాటె చెప్పుకోవాల. బాబు సభను ఘనంగాజేసిండి. ఎంత ఘనమంటే, గదేదో అమరావతి కట్టేసినంత సంబరపడ్డడు. ఇదేమన్నా చిన్నాచితకా ప్రాజెక్టా? ఇప్పటికిప్పుడు ఎట్లా పూర్తవుతది? అప్పటికి ఎవరుంటరో, ఎవరుబోతరో..ఎవరికెరుక… అందుకే బాబు తొందరపడ్డట్లున్నాడ్. గదే మంచిదె, గీ రాజకీయాలను నమ్మలేం. పైగా ఆంధ్రాలా పక్కనే, జగన్ బళ్లెంలెక్క ఉన్నాడాయె.

పాతస్నేహం యాదికొచ్చి పిలిచాడు. ఈ రాజకీయాల్లో గప్పుడప్పుడు గిట్లా కలుపుకుంటూ పోవాల. అందుకే వెళ్లొచ్చిన. సభలో గూర్చుంటినికానీ, నవ్వుఆగల. ఆడ నవ్వితే బాగుండదని సప్పుడుసేయక కూర్చున్న. కానీ నాలోని కేసీఆర్ నవ్వుకుంటూనే ఉన్నడు. లేకపోతే ఏంటీ, బాబు మాట్లాడిన తీరు నవ్వుపుట్టించక మరేమవుతది.

బాబు నన్ను మిత్రుడిల చూసుకుంటున్న ఈ కొత్త లెక్కన, ఆయన్కి సలహా ఇద్దామనుకున్న. కానీ సప్పుడుసేయల. మోదీగారిని ఏపీ హోదా గురించి బాబు అడుగుతాడనుకుంటి, అబ్బే ఆ ఊసేలె. పోనీ ప్యాకేజీ గట్రా అడుగుతాడనుకుంటి, అబ్బే అదీలె. అప్పుడే నాకు నవ్వొచ్చింది. అడిగే తీరు ఇదికాదు బాబూ… గట్టిగా కడిగేయాలి. గదే నేనైతే ఏలెక్కన కడిగేస్తానో చెబ్దమనుకుంటి. కేసీఆర్ స్టయిల్లా కడిగేస్తే ప్యాకేజీఏంటీ హోదాకూడా పరిగెత్తుకుంటూ రావాల.

తెలంగాణ ఉద్యమంలో మనం ఎలా కడిగేశామ్..? ఎలా చెరిగేశామ్…? అదంతా బాబుకి కూడా ఎర్కె. సోనియా అయినా, గీనియా అయినా సరే బేఖాతర్. పొగడాల్సినచోట పొగడ్తం, తిట్టాల్సినచోట తిడ్తం. అవసరం లెక్కన కాల్మొక్కుతామంటమ్, గదె గుస్సావస్తె గోరీకడ్తమంటమ్. మరీ అంతలా తిట్టారేంటని ఎవరన్నా గింజుకుంటే, `అరే, మా భాషంతే, ఇవి తిట్లుకావ్’అంటూ అడ్డంగా వాదిస్తాం.

`నీ బొందపెడ్తాం, నీ బొక్కలేరతాం, నేనేమన్నా హవలాగాడిననుకున్నావ, హోదా ఇస్తుడో, చచ్చుడో ఇప్పుడే ఈడనే తేలాల. లేకుంటే గల్లీగల్లీలా మీ దిష్టిబొమ్మలు ఈడ్చుకెల్తాం. లుచ్ఛాపనులుచేసినందుకు చమడా వలుస్తాం. అందుకె,ఇచ్చుడో గిచ్చుడో ఈడె తేలిపోవాలి…ఇవ్వకుంటె ఊరుకుంటమా.. గుంజుకొస్తాం…’

ఈ తీర్న మాట్లాడితె ఢిల్లీవోళ్లు గజగజలాడిపోరు.. పెట్టిలోనుంచి హోదా తీసి ఇచ్చేయరా. అంతేగానీ, ఈ నాన్చుడేంటీ. నాకు నచ్చల. అదే మనతీరుదైతే తఢాకా చూపించోడ్ని. కానీ ఆడ మనకెందుకని చప్పునున్నా.

అందుకె ఆడ మూడు ముక్కలె మాట్లాడిన, లేకుంటే మూడు గంటలపాటు, బొందలు, బందులంటూ బెదరగొట్టేవాడ్ని. చివర్న ఒక్కమాట. మరో నాయకుడున్నాడక్కడ. హోదాకోసం తిండిలేకుండా పడుకుంటనన్నడు. కానీ నాలాకాదు, ఢీలపడిపోయాడు. ఉద్యమం గాలితీసిన బుడగలెక్కైంది. ఉద్యమం అంటే ఎట్లుండాల. లాభంలేదు, వీళ్లు నాదగ్గర క్లాసులు తీస్కోకావాల. గప్పుడే రెండు తెలుగురాష్ట్రాలు రయ్యిన దూసుకుపోతాయి. అందుకు నె గ్యారంటీ. బాబూ మళ్ళీ పిల్వనంపితె, ఎలా మాట్లాడాలో నేజెబ్త..

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close