వివరణ ఇచ్చిన వెంకయ్య నాయుడు

హైదరాబాద్: అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదానుగానీ, ఎటువంటి ప్యాకేజ్‌నుగానీ ప్రకటించకపోవటంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ప్రత్యేక హోదా అంశం నీతి ఆయోగ్(ప్రణాళికా సంఘం) పరిశీలనలో ఉందని చెప్పారు. ఏపీకి కేంద్రం న్యాయం చేయటం అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. వెంకయ్యనాయుడుకు చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్ హైదరాబాద్ విభాగం భవన భూమిపూజ ఇవాళ శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లో జరిగింది. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయటానికి సమయం పడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. నూతన రాజధాని అమరావతినికూడా అమృత్ పథకం కింద చేర్చామని చెప్పారు. ప్రధాని తీసుకొచ్చిన మట్టి, నీటిని చులకనగా మాట్లాడటం తగదని, ఒక సెంటిమెంట్‌గా ఆయన వాటిని తీసుకొచ్చారని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]