రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో ఓచిత్రం రూపుదిద్దుకుంటోంది. కైరా అద్వానీ కథానాయిక. ఈచిత్రంలో ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు. నిజానికి ఈపాత్ర కోసం చాలా రకాల పేర్లు వినిపించాయి. శ్రీకాంత్ ని సైతం విలన్ గా చూపిద్దామనుకున్నారు. కానీ శంకర్ మనసు మారింది. తమిళంలో వరుసగా సూపర్ హిట్లు కొడుతున్న ఎస్.జె.సూర్యని ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. ఈ సినిమాలో సూర్య పాత్ర ఏమిటన్న ఆసక్తినెలకొంది. ఇందులో సూర్య సీఎంగా కనిపించబోతున్నాడు. ఓ ముఖ్యమంత్రికీ, ఎన్నికల కమీషనర్కీ మధ్య నడిచే సమరం.. ఈ కథ. ఎన్నికల కమీషనర్ గా రామ్ చరణ్ ఇందులో నటించబోతున్నాడు. నిజాయతీ గల ఐపీఎస్ అధికారిగా చరణ్ కనిపించబోతున్నాడు. సీఎంతో ఎలక్షన్ కమీషనర్కి జరిగిన వార్, వాళ్ల మధ్య ఈగో క్లాషెస్… వీటి చుట్టూ ఈ కథ నడవబోతోంది. శ్రీకాంత్ పాత్రలోనూ నెగిటీవ్ లక్షణాలు కనిపించబోతున్నాయని టాక్. చరణ్ కి స్నేహితుడి పాత్రలో సునీల్ కనిపించబోతున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.