స్టార్ హీరోలూ… పాఠాలు నేర్చుకోండి!

2018 వెళ్తూ వెళ్తూ కొన్ని విజ‌యాల్ని, కొన్ని చేదు జ్ఞాప‌కాల్నీ ఇచ్చి వెళ్లింది. అన్నింటికంటే కొన్ని కీల‌క పాఠాల్ని నేర్పి వెళ్లింది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల‌కు. 2018 పోగ్రెస్‌కార్డు…మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచికి అద్దం ప‌ట్టింది. కోట్లు ధార‌బోసిన సినిమాలైనా ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోవ‌డం లేదు. సున్నిత‌మైన క‌థ‌ల‌తో వ‌స్తే… ఆద‌రిస్తున్నారు. వినోదాత్మ‌క కుటుంబ క‌థా చిత్రాల‌కు పెద్ద పీట వేస్తున్నారు. ఇమేజ్‌ని ప‌క్క‌న పెట్టి ప్ర‌యోగాలు చేసినా ఆద‌రిస్తామ‌ని హామీ ఇస్తున్నారు.

రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను లాంటి చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్ క‌థానాయ‌కుల‌కు పాఠాలుగా మారిపోతాయి. రంగ‌స్థ‌లం మామూలు రివైంజ్ డ్రామానే. కానీ.. దాన్ని ఓ కొత్త నేప‌థ్యంలో చూపించ‌డం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. హీరో అంటే ధీరోధాత్తుడే కాన‌క్క‌ర్లేద‌ని, లోపాలున్న మ‌నిషిగా చూపించినా ఇమేజ్‌కి ఏమాత్రం భంగం క‌ల‌గ‌ద‌ని రంగ‌స్థ‌లం నిరూపించింది. ఈ త‌ర‌హా ప్ర‌యోగాలు మ‌రిన్ని చేయ‌డానికి ఈ సినిమా ఊతం వ‌చ్చింది. భ‌ర‌త్ అనే నేను కూడా అంతే. క్లాసీగా క‌నిపించిన మాస్‌సినిమా ఇది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు రోజులు పోయాయన్న మాట‌ల‌కు ఈ సినిమా వంద కోట్ల‌తో బ‌దులు చెప్పింది.

క‌థ‌లో వైవిధ్యం లేక‌పోయినా ఫ‌ర్వాలేదు.. క‌థ‌నం బాగుంటే చాలు అని చెప్ప‌డానికి ‘గీత గోవిందం’ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఈ సినిమాలో క‌థే లేదు. కానీ.. క‌థ‌నం, క‌థానాయ‌కుడి పాత్ర చిత్ర‌ణ‌.. హీరో, హీరోయిన్ల మ‌ధ్య క‌నిపించిన కెమిస్ట్రీ.. ఇవన్నీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాయి. చిన్న సినిమాల్లోనే పెద్ద విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాయి. బ‌యోపిక్ ఎలా తీయాలో చెప్ప‌డానికి ‘మ‌హాన‌టి’ ఓ పాఠంగా మారింది. ‘అర్జున్ రెడ్డి’ ఫీవ‌ర్ 2018లో కొన్ని సినిమాల్లో క‌నిపించింది. అల్లు అర్జున్ న‌టించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లోని క‌థానాయ‌కుడి పాత్ర పూర్తిగా ఎగ్రెసివ్‌గా ఉంటుంది. ‘కిరాక్ పార్టీ’లో నిఖిల్ కూడా అంతే. అయితే తెలుగు ప్రేక్ష‌కులు చూసిందే చూడ్డానికి ఇష్ట‌ప‌డ‌రు. అందుకే ఈ సినిమాల్ని తిప్పి కొట్టారు. ఓ పాత్రనో, క‌థ‌నో చూసి స్ఫూర్తి పొందాలి గానీ, దాన్ని అనుక‌రించ‌కూడ‌ద‌ని చెప్పిన ప‌రాజ‌యాలివి. రొడ్డ‌కొట్టుడు మాస్ డ్రామాలు చూడ‌ర‌న్న విష‌యం ‘ట‌చ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’ నిరూపించాయి. మేం కొత్త క‌థ తీశాం.. ఇదో ప్ర‌యోగం అనుకుని ప్రేక్ష‌కుల‌తో ఆడుకుంటే ఏం జ‌రుగుతుందో ‘మ‌ను’, ‘వీర భోగ వ‌సంత‌రాయులు’ ఫ‌లితాలు తేల్చి చెప్పేశాయి.

ఇవ‌న్నీ 2019లో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు, క‌థానాయ‌కుల‌కు పాఠాలే. ఈ అనుభ‌వాల నుంచి ఎవ‌రెంత నేర్చుకుంటార‌న్న‌ది కీల‌కం. 2019 లో కొత్త త‌ప్పులు చేసినా ఫ‌ర్వాలేదు, పాత త‌ప్పులు రిపీట్ చేయ‌కుండా ఉంటే అదే ప‌ది వేలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close