చిరు – సుకుమార్.. మేట‌రేంటి?

ప్ర‌స్తుతం రంగస్థ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నాడు సుకుమార్‌. గ‌త వారం రోజుల నుంచీ చెన్నైలోనే మ‌కాం పెట్టేశాడు. 30న రంగ‌స్థ‌లం విడుద‌ల అవుతుంది. ఆ త‌ర‌వాత‌.. ఫ్రీనే. సుక్కు ప‌నిత‌నం రామ్‌చ‌ర‌ణ్‌కి మ‌హ బాగా న‌చ్చేసింద‌ని, చిరంజీవి కూడా సుకుమార్‌కి ఫ్యాన్ అయిపోయాడ‌ని టాలీవుడ్ అంతా టామ్ టామ్ అయిపోతోంది. అందుకే చిరు 152వ సినిమా అవ‌కాశం సుక్కుకే ద‌క్కింద‌ని చెబుతున్నారు. సైరా త‌ర‌వాత సుకుమార్‌తో చిరంజీవి సినిమా రావ‌డం ఖాయ‌మ‌ని జోస్యాలు మొద‌లైపోయాయి. అయితే సుకుమార్ మాత్రం `అలాంటిదేం లేదు` అని కుండ బద్ద‌లు కొట్టేశాడు. ”చిరంజీవిగారంటే నాకు చాలా అభిమానం. ఆయ‌న సినిమాలు చూస్తూ పెరిగిన‌వాడ్ని. ఆయ‌న‌తో సినిమా చేసే అవ‌కాశం వ‌స్తే… అంద‌రి కంటే ముందు నేనే మీడియాకు చెప్పేస్తా. మా ఇద్ద‌రి మ‌ధ్యా అలాంటి డిస్క‌ర్ష‌న్ రాలేదు. ఈ కాంబోపై వ‌స్తున్న వార్త‌లు త‌ప్పే” అంటున్నాడు.

సుకుమార్ త‌దుప‌రి సినిమా అల్లు అర్జున్‌తో అయ్యుండే ఛాన్సుంద‌ని తెలుగు 360 ముందే చెప్పింది. సుక్కు కూడా… దానికి ‘నో’ చెప్ప‌డం లేదు. ”బ‌న్నీ నా బెస్ట్ ఫ్రెండ్‌. త‌న‌తో ఎప్పుడైనా సినిమా చేసే అవ‌కాశం ఉంది” అంటూ చూచాయిగా త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు. సో… బ‌న్నీ – సుక్కు కాంబోకి మ‌రోసారి రెడీ అయిపోవొచ్చన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.