బాల‌య్య – ఎన్టీఆర్‌ల‌ను క‌లుపుతున్నాడా?

క‌ల్యాణ్‌రామ్ వేయ‌బోతున్న ఓ ‘కొత్త’ స్టెప్ నంద‌మూరి అభిమానుల్లో ఉత్కంఠ‌త‌ని, ఆసక్తిని పెంచుతోందిప్పుడు. క‌ల్యాణ్ రామ్ ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. అదీ.. బాబాయ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో. బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థ విన‌లేదు. కానీ.. క‌ల్యాణ్ రామ్ మాత్రం ‘ఈ సినిమా చేస్తే బాబాయ్‌తోనే చేయాలి’ అనుకుంటున్నాడ‌ట‌. ప‌వ‌న్ సాధినేని రాసిన క‌థ‌… క‌ల్యాణ్ రామ్‌ని అంత‌గా టెమ్ట్ చేస్తోంది. ఎన్టీఆర్ – రామ్ చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టించ‌డానికి రెడీ అయిన కాలం ఇది. ఇమేజ్‌ల గురించి, కుటుంబ నేప‌థ్యాల గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అలాంట‌ప్పుడు ఒకే కుటుంబంలోని ఇద్ద‌రు హీరోలు క‌లిసి న‌టించ‌డంలో ఆశ్చ‌ర్యం ఏమీ లేదు. బాల‌య్య ‘ఎస్‌’ చెప్పేసే అవ‌కాశాలే ఎక్కువ క‌నిపిస్తున్నాయి.

ఇది నిజంగా నంద‌మూరి అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తించే విష‌య‌మే. ఎందుకంటే.. అంత‌ర్లీనంగా ఈ సినిమా వెనుక ‘బాల‌య్య ఎన్టీఆర్‌ల‌ను క‌లిపే’ ఉద్దేశం కూడా దాగుంది. ఎన్టీఆర్ – క‌ల్యాణ్‌రామ్ మ‌ధ్య రోజు రోజుకీ పెన‌వేసుకుపోతున్న బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు. ఇద్ద‌రూ భాయ్ మేరే భాయ్ అంటూ క‌లిసిపోయారు. ఎప్పుడైతే క‌ల్యాణ్‌రామ్‌… ఎన్టీఆర్‌కి బాగా ద‌గ్గ‌ర‌య్యాడో.. బాల‌య్య క‌ల్యాణ్ రామ్‌తో అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మ‌రోవైపు బాల‌య్య‌, ఎన్టీఆర్‌ల మ‌ధ్యే అడ్డుగోడ ఉంది. దాన్ని ప‌డ‌గొట్ట‌డానికి ఈ మ‌ల్టీస్టార‌ర్ ఓ మార్గం కాబోతోంది. అదెలాగంటే… అటు బాల‌య్య‌కూ, ఇటు ఎన్టీఆర్‌కూ క‌ల్యాణ్ రామ్ అంటే ఇష్టం. ఈమ‌ధ్య క‌ల్యాణ్‌రామ్‌ని బాల‌య్య దూరం పెట్టినా.. ”బాబాయ్ నా కోసం ఓ సినిమా చేవ‌వా” అని క‌ల్యాణ్ అడిగితే బాల‌య్య కాద‌న‌లేడు. అలా… మ‌ళ్లీ బాబాయ్ అబ్బాయ్‌లు క‌లిసిపోతారు. ఆ త‌ర‌వాత మెట్టు ఎన్టీఆర్ – బాల‌య్య‌ల‌ను క‌ల‌ప‌డ‌మే. క‌ల్యాణ్ రామ్ కోస‌మైనా ఎన్టీఆర్‌, బాల‌య్య క‌ల‌వ‌క‌పోతారా… అనేది నంద‌మూరి ఫ్యాన్స్ మాట‌.

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీకి గట్టి పోటీ ఎదుర‌వుతోంది. ఎన్టీఆర్‌ని ఎన్నిక‌ల కోసం రంగంలోకి దించ‌డం.. టీడీపీ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా క‌నిపిస్తోంది. అందుకోసం ఏ చిన్న అవ‌కాశం కూడా వ‌దులుకోవ‌డానికి టీడీపీ సిద్ధంగా లేదు. క‌నీసం పార్టీ కోస‌మైనా.. ఎన్టీఆర్ – బాల‌య్య క‌ల‌సి ప‌నిచేయ‌డానికి ముందుకొచ్చే అవ‌కాశాలున్నాయి. అందుకు ఈ మ‌ల్టీస్టార‌ర్ ఓ ముంద‌డుగు అయ్యే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.