తెలంగాణ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును శుక్రవారం జూబ్లిహిల్స్ స్టేషన్ లో సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయనను శారీరకంగా హింసించకుండా ఇంటరాగేట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ 1గా ఉన్నారు. కేసు నమోదయ్యే సమయానికి ఆయన అమెరికా వెళ్లిపోయారు. పాస్ పోర్టు రద్దు చేసి.. ప్రకటిత నేరస్తుడిగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే సమయానికి సుప్రీంకోర్టు నుంచి రక్షణ తీసుకుని ఇండియాకు వచ్చారు. అయితే ఆయన విచారణకు సహకరిచడం లేదని పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఆధారాలన్నింటినీ ధ్వంసం చేయడంతో పాటు విచారణకు సహకరించడం లేదని పోలీసులు .. ఆయన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనను పోలీసుల ఎదుట సరెండర్ కావాలని ఆదేశించింది. పోలీసుల ఆయనను ఈ కేసులో ప్రశ్నించే అవకాశం ఉంది. తదుపరి విచారణ తదుపరి వారం జరుగుతుంది.
అయితే ఇప్పుడు ప్రభాకర్ రావు కు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు అయిందా లేదా అన్నది క్లారిటీ లేదు. రద్దు అయినట్లేనని కొంత మంది భావిస్తున్నారు. సరెండర్ కావడం అంటే అర్థం అదేనని చెబుతున్నారు. కానీ కోర్టులో కాకుండా పోలీసుల ఎదుట సరెండర్ కావాలని సుప్రీంకోర్టు చెప్పిందని అంటే విచారణ కోసమేనని.. మరికొందరు అంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.