సింగం 3… డేట్ ఫిక్స‌య్యింది!

ఈనెల 16న రావాల్సిన సింగం 3.. ధృవ ఎఫెక్ట్‌తో ఓ వారం రోజులు ఆల‌స్యంగా వ‌ద్దామ‌నుకొంది. డిసెంబ‌రు 23న సింగం 3 రిలీజ్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అనుకొన్నారు. అయితే… చిత్ర‌బృందం మాత్రం ఇంకొంచెం స‌మ‌యం తీసుకోవాల‌ని భావించింది. అందుకే.. మ‌రోసారి సింగం 3ని వాయిదా వేసింది. చెన్నైలో వ‌ర్షాల కార‌ణంగానూ, పెద్ద నోట్ల ర‌ద్దుతోనూ ఈ సినిమా వాయిదా ప‌డింద‌ని చెప్పుకొన్నారు. ఇప్పుడు సింగం 3 కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చింది. 2017 జ‌న‌వ‌రి 26న ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యం తీసుకొంది.

సూర్య క‌థానాయ‌కుడిగా న‌టించిన సింగం కి హ‌రి ద‌ర్శ‌కుడు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన సింగం, సింగం 2 మాస్‌ని మెప్పించాయి. బాలీవుడ్‌లోనూ రీమేక్ రూపంలో వెళ్లి ఘ‌న విజ‌యం సాధించాయి. అందుకే సింగం 3పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ప్ర‌చార చిత్రాలు, అందులో సూర్య గెట‌ప్ అభిమానుల్ని ఆక‌ట్టుకొన్నాయి. ట్రైల‌ర్ అయితే యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది. అనుష్క‌, శ్రుతిహాస‌న్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. వారిద్ద‌రి గ్లామ‌ర్, హ‌రి టేకింగ్‌ ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతున్నాయి. ఈయేడాది 24తో సూర్య ఓ సూప‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకొన్నాడు. 2017నీ హిట్ సినిమాతోనే మొద‌లెడ‌తాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజీనామా చేసిన వాలంటీర్ల పెడబొబ్బలు !

తమను మల్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు వెనుకాడటం లేదు. వారి బాధ ఇప్పుడు...

క‌థాక‌మామిషు: ఈవారం క‌థ‌ల‌పై రివ్యూ

క‌థా స్ర‌వంతిలో మ‌రో వారం గ‌డిచిపోయింది. ఈవారం (జూన్ 16) మ‌రి కొన్ని క‌థ‌లు పాఠ‌కుల ముందుకు వ‌చ్చాయి. ర‌చ‌నా శైలి ఎలా ఉన్నా, వ‌స్తువులో వైవిధ్యం క‌నిపించ‌డం మంచి ప‌రిణామం. నాన్న...

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

ఘోర రైలు ప్రమాదం… కవచ్ టెక్నాలజీ ఏమైంది..?

దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close