ఆ బిల్డింగ్ కూల్చివేత బీసీల ఆర్థిక మూలాలపై దాడేనట..!

తిరుపతిలో టీడీపీ నేతల పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేత ఘటనకు టీడీపీ సామాజికవర్గాల రంగు పూస్తోంది. పల్లా శ్రీనివాస్ యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన తండ్రి కూడా ప్రజాసేవలో ఉన్నారు. గాజువాక పరిసర ప్రాంతాల్లో ఆయన కుటుంబానికి సామాజికవర్గ పలుకుబడి కూడా ఉంది. ఈ నేపధ్యంలో.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తున్న కూల్చివేతలను సామాజిక అంశంగా మార్చాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. నిన్నెక్కడా.. పల్లా శ్రీనివాస్‌ భవన కూల్చివేతను .. బీసీలపై దాడిగ ాచెప్పని టీడీపీ నేతలు ఇవాళ… ఒక్క సారిగా తమ ఎటాక్ ప్రారంభించారు.

ముందుగా పల్లా సామాజికవర్గానికే చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెర ముందుకు వచ్చారు. బీసీలు వ్యాపారాలు చేసుకోకూడదా? అని ప్రశ్నించారు. పల్లా శ్రీనివాస్ ప్రభుత్వ అనుమతులతో భవనం నిర్మాణం చేపట్టారని… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు, భూముల కబ్జాకు వ్యతిరేకంగా దీక్ష చేసినందుకు కక్షతో అక్రమంగా భవనం కూల్చివేశారని.. ఇది ముమ్మాటికీ రాజకీయ దాడేనని తేల్చి చెప్పారు. టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యావద్ కూడా.. పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేతను బీసీలపై దాడిగా పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి బీసీపై దాడి ప్రారంభించారుని.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లో కోత కోసి.. 16,800 మంది బీసీల్ని రాజకీయ పదవులకు దూరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌రెడ్డి దుర్మార్గాన్ని, బీసీ ద్రోహాన్ని.. బలహీన వర్గాలు, యాదవ సంఘాలు ఖండించాలని పిలుపునిచ్చారు. పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేత వ్యవహారం ఇప్పుడు.. రాజకీయంగా కలకలం రేపుతోంది. అన్ని రకాల ప్లాన్లు. .అనుమతులు ఉన్నప్పటికీ… నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేయడంపై పల్లా శ్రీనివాస్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు టీడీపీ ఈ అంశాన్ని యాదవ సామాజికవర్గంపై దాడిగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో ఈ అంశం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close