తెలంగాణాలో తెదేపాకి మరో షాక్!

ఆంధ్రప్రదేశ్ లో తెదేపా వైకాపాకి షాకులిస్తుంటే, తెలంగాణాలో తెరాస తెదేపాకి షాకులు ఇస్తోంది. ముగ్గురు తప్ప తెదేపా ఎమ్మెల్యేలందరినీ తీసుకొనిపోయిన తెరాస, ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపి మల్లారెడ్డిని కూడా తీసుకుపోబోతోంది. ఆయన జూన్ 2న తన అనుచరులతో కలిసి తెరాసలో చేరబోతున్నారని తాజా సమాచారం. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఆయన పూర్తి చేసుకొన్నారు.

ఆయన 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరి మల్కజ్ గిరి నుంచి పోటీ చేసి లోక్ సభకి ఎన్నికయ్యారు. తెదేపా సీనియర్ నేత రేవంత్ రెడ్డిని కాదని ఆ సీటు మల్లారెడ్డికి కేటాయిస్తే, ఆయన ఇప్పుడు పార్టీకి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డికే దానిని కేటాయించి ఉండి ఉంటే, తెదేపా దానిని నేడు కోల్పోయేదే కాదు.

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ కూడా ఆ సీటు కోసం చంద్రబాబు నాయుడుని అభ్యర్ధించారు. ఒకవేళ కేటాయించి ఉండి ఉంటే, ఒక మంచి అభ్యర్ధిని లోక్ సభకు పంపినట్లుండేది. కానీ అందరినీ కాదని మల్లారెడ్డికి అప్పగిస్తే ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయిస్తున్నారు. దీనితో తెలంగాణాలో తెదేపాకి ముగ్గురు ఎమ్మెల్యేలు (వారిలో ఆర్. కృష్ణయ్య గత రెండేళ్లుగా తెదేపాకి దూరంగా ఉంటున్నారు), కొందరు నేతలు మాత్రమే మిగిలారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణా శాసనసభలో కనీసం 99 సీట్లు సాధించే విధంగా ప్రణాళికలు రచించుకొని పనిచేస్తానని రేవంత్ రెడ్డి మహానాడులో చెప్పి సరిగ్గా 24గంటలు కూడా కాక మునుపే, మల్లారెడ్డి పార్టీ గోడ దూకేయడానికి సిద్దం అవడం విశేషం. మరి రేవంత్ రెడ్డి ఆ లక్ష్యం ఏవిధంగా సాధిస్తారో? చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close