హెచ్ఎంటీవీ కథ : బుల్లితెరపై వామనవిలాపం…

ఆయన వందల కోట్లకు అధిపతి. 45 రకాల పరిశ్రమలు విజయవంతంగా నడిపిస్తున్న వ్యాపారవేత్త. బ్రెడ్ దగ్గర్నుంచి లగ్జరీ విల్లాల వరకు విస్తరించిన ఆయన సామ్రాజ్యంలో అన్నింటిలోనూ విజయం సాధించిన ఘనత ఆయనది. తెలంగాణ రామోజీగా ఎదగాలన్న డ్రీమ్ ఆలోచన మేరకు మీడియాలోకి అడుగుపెట్టాడీయన. ఆయన చిత్తశుద్ది గురించి ప్రశ్నించే పని చేయడం లేదు. అందరూ మీడియాలోకి వస్తున్నారు నేను వస్తే వచ్చే నష్టమేంటని అనుకున్నారేమో ఆయనా ఒక చానెల్(హెచ్ఎంటీవీ) మొదలు పెట్టారు.ఆయనే వామన రావు..కోట్ల ఆస్తులు వున్న కపిల్ గ్రూపు అధినేత.ఆయనకు ఉన్న అన్ని పరిశ్రమల ద్వారా పేదలకు ఎంతో కొంత మేలు చేయాలని భావించే ఈ వామనరావు గారు మీడియాలోకి రావడం ద్వారా ప్రజలకు ప్రభుత్వాల నుంచి ఇంకా ఎక్కువ మేళ్లు చేయవచ్చని భావించారు.

అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కాకలు తీరిన ఈ బిజినెస్ మ్యాన్ ఇప్పుడు ఈ హెచ్ఎంటీవీ చానెల్ వ్యవహారంలో విలపిస్తున్నాడు.సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి ద్వారా తన కంపెనీని ఆరంభించిన వామనరావు తన చానెల్ని ఊరి బయట ఏఎస్ రావు నగర్ లో ప్రారంభించాడు. తెలివుండి ఇలా చేశారో, లేక మరి మెయిన్ సిటీలో ఆఫీసు దొరక్కో, లేక కోర్ టీం సరైన క్లారిటీగా చెప్పలేకపోవడం వల్లనో మరీ ఊరికి దూరంగా చానెల్ ఏర్పాటైపోయింది.ఆరంభంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న చానెల్ తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకొంది.క్యాష్ చేసుకుందని మాత్రం అనలేము గాని,మరే చానెల్ నిర్వహించని విధంగా దశ-దిశ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది.రేటింగ్ విషయం పక్కనబెడితే డిబేట్లలో జరిగిన వాదోపవాదాలతో పాపులార్టీ మాత్రం సంపాదించగలిగింది. అయితే ఆ తర్వాత చానెల్ రెవిన్యూ, రాబడి సమస్య ఎక్కువై ఇబ్బందులెదుర్కొంది.నెలనెలా అయ్యే ఖర్చు,వచ్చేదానితో పోల్చుకుంటే భారీగా పెరుగుతూపోయింది.

ఉన్న కష్టాలకి తోడు హెచ్ఎంటీవీ హ్యాన్స్ ఇండియా అంటూ ఆంగ్ల పత్రికను ప్రారంభించించి చేతులు కాల్చుకుంది.పేపర్,టీవీ రెండూ ఉండే పెద్ద మీడియా గ్రూపుగా కలిగే ప్రయోజనాలు విస్తారంగా ఉంటాయని యాజమాన్యాన్ని కోర్ టీం ఒప్పించగలిగింది. అప్పటికే టైమ్స్ దెబ్బకు రూపాయి,రూపాయిన్నరకు ఆంగ్ల పత్రికలు అమ్ముతున్న తరుణంలో పత్రిక ఎలా నిలదొక్కుకుంటుందని కనీసం వామనరావు ఆలోచించకపోవడం విడ్డూరం.హ్యాన్స్ ఇండియా పత్రికను ఎవరు చదువుతారో.. ఏంటో ! వేరే వ్యాపారాల్లో డబ్బులొస్తున్నాయి కాబట్టి మీడియాను నడిపించేస్తున్నాడు. అటు పత్రిక, ఇటు టీవీ మూలంగా కపిల్ గ్రూపు నష్టం ఇప్పటికి 200 కోట్ల వరకు చేరుకుందన్న అభిప్రాయం మీడియా వర్గాల్లో ఉంది.

అలనాడు బలి చక్రవర్తికి చేసిన అన్యాయం తీరడానికా అన్నట్టు ఈ కలియుగంలో మొదటి అడుగు రాముడితో, రెండో అడుగు కృష్ణుడితో, మూడో అడుగు ఈశ్వరుడితో తన తలపై వేయించుకొని,మన వామనుడు అధః పాతాళానికి చేరబోతుండడం వైచిత్రి అనుకోవాలి. ఎవరా రాముడు ,కృష్ణుడు, ఈశ్వరుడు ? చూద్దాము.

ముందుగా రామచంద్రమూర్తి (రాముడు) గారు వెళ్లిపోవడంతో , ఆ తర్వాత ఎన్టీవీ రాజశేఖర్ చానెల్ బాధ్యతలు చేపట్టడం, హ్యాన్స్ ఇండియా పత్రికకు సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఎడిటర్ గా రావడం జరిగిపోయాయ్. అయితే మూడు నెలల్లోనే రాజశేఖర్ దెబ్బకు కంపెనీ రిప్యూటేషన్ దెబ్బతిందని,ఆయన్ని పంపించి, అప్పటికి డిబేట్లు చేస్తున్న వీకే అలియాస్ వెంకట కృష్ణ(కృష్ణుడు)ను సీఈవో చేసినా చానెల్ మాత్రం అదే విధంగా మిగిలిపోయింది,ఎలాంటి పురోగతి సాధించలేదు. వీకే కు ఇచ్చిన ఏడాది కాంట్రాక్ట్ లో ఆయన సాధించింది శూన్యమని, ఖర్చు రాబడికి తేడా డబుల్ కు మించిపోయిందన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన వామనరావు నాలుగో కృష్ణుడి రూపంలో ఈశ్వరుడ్ని తెరపైకి తెచ్చాడు. హ్యాన్స్ ఇండియా ఎడిటర్ గా పనిచేస్తున్న నాగేశ్వర్ ను టీవీ మీడియాలోకి తెచ్చారు. పేపర్, టీవీకి ఒక్కరే ఉంటే అదుర్స్ అన్న అభిప్రాయంలో అలా చేశారని గ్రూపులో పనిచేసే మిత్రులు చెప్పుకొచ్చారు. టీవీకి కావాల్సిన వైవిధ్యం విస్తృతమైనది.మేధావి తెలివితేటలతో చానల్ విజయం సాధించడం కష్టమన్నది ఇప్పటికీ ఈయనకు అర్థంకాకపోవడం విడ్డూరం.మేధావిని ఎంత వరకు ఉపయోగించుకోవాలో అలా చేసుంటే బాగుండేది. ఇక ఆ వీ.కే. వెళ్లిపోతాడుకుంటే ఆయన ఇంకా వెళ్లడం లేదన్న గుసగుసలు కంపెనీలో విన్పిస్తున్నాయ్.

ఒకసారి ఎవరికైనా బాధ్యత అప్పగిస్తే ఏడాదిపాటు మధ్యలో జోక్యం చేసుకోకూడాదన్న నిబంధన వామనుడిది. అలా చేయడం వల్లే ఇప్పుడు సమస్యలొచ్చాయని తెలిసి కూడా ఈ నిబంధన ఇంకా పెట్టుకున్నాడు మన వామనరావు. హెచ్ఎంటీవీ లో వచ్చే వైపరిత్యాలకు గ్రూప్ కంపెనీలు ఏమవుతాయో… మరి కాలమే సమాధానం చెప్పాలి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజలు హామీ ఇస్తే దేశ రాజకీయాల్లోకి : కేసీఆర్

తెలంగాణ ప్రజలు హామీ ఇస్తే దేశ రాజకీయాల్లోకి వెళ్తామని సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఆయన బహిరంగసభలో మాట్లాడారు. ఈ...

వరుస సినిమాలు – వచ్చే ఏడాది కూడా పవన్ బిజీనే !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త సినిమాల ప్రకటనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు కంప్లీట్ అవడానికి జనవరి వరకూ పడుతుంది.. ఆ తర్వాత...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇంటికి పంపేసిన ఏపీ సర్కార్ !

ఉద్యోగంలో చేరి పదేళ్లు కాని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందర్నీ.. తక్షణం టెర్మినెట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాన్ఫిడెన్షియల్ అయిన ఈ జీవో ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఔట్ సోర్సింగ్...

ఈడీ పరిధిలోకి పోలీసుల్ని కూడా తెచ్చిన కేంద్రం !

రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కించిత్ పట్టించుకోవడం లేదు సరి కదా ఇంకా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close