అతి చేసి కేసుల పాలయిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు !

రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధిస్తోందంటూ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఆందోళన రివర్స్ అయింది. కొంతమంది నేతల అతి వల్ల ముఖ్య నేతలు కేసుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఈడీ తీరుకు నిరసనగా చలో రాజ్ భవన్‌కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ ముట్టడించకుండా పోలీసులు ఆపుతారనితెలుసు కాబట్టి కొత్తగా ఆలోచించారు. తెల్లవారుజామునే ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఆ తర్వాత పది గంటల సమయంలో ఇతర నేతలు ముట్టడించారు. దీంతో పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

అది దారి తప్పింది. బారికేడ్లు తప్పించి… మరీ నేతలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఓ మహిళా ఎస్‌ఐని డొక్కలో తన్నడమే కాదు.. మరో ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు. టచ్ చేస్తే స్టేషన్‌కు వచ్చి కొడతానని హెచ్చరించారు. మల్లు భట్టి విక్రమార్క కూడా ఓ డీసీపీ కాలర్ పట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. కాంగ్రెస్ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లుగా లాఠీచార్జ్ చేసిన పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. పలు సెక్షన్ల కిందకేసులు పెట్టారు.

చివరికిరేవంత్ రెడ్డిపై కూడా కేసులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఆందోళనలు అన్ని పార్టీలు చేస్తాయి.. వారిని పోలీసులు స్టేషన్లకు తరలించి వదిలేస్తారు. కేసుల్లాంటివి పెట్టరు. కానీ ఇక్కడ పోలీసులపైనే రుబాబు చూపించడంతో కేసుల పాలవ్వాల్సి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2024 బాక్సాఫీస్ : సెకండాఫ్ పైనే ఆశ‌లు

ఈ యేడాది అప్పుడే నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. కీల‌క‌మైన వేస‌వి సీజ‌న్ స‌గానికి వ‌చ్చేశాం. సంక్రాంతిలో మిన‌హాయిస్తే స్టార్ హీరోల సినిమాలేం బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈ వేస‌వి చాలా చ‌ప్ప‌గా, నీర‌సంగా,...

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్‌కు వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close