భారీ వేలాలే కాదు పేదల కోసం కూడా తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆలోచిస్తోంది. అల్పాదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఎల్ఐజీ ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లోని మొత్తం 339 ఫ్లాట్లను (Flats) అందుబాటులోని ధరలతో ఎక్కడ ఉన్నవి అలానే అన్న ప్రాతిపదికన విక్రయించేదుకు ఏర్పాట్లు చేసింది.
అల్పాదాయ వర్గాల ప్రజలకు (ఎల్ ఐ జి) మంచి వసతులతో కూడిన సొంత ఇంటి వసతిని కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఇప్పటికే అనేక కుటుంబాలు నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ – అపార్ట్ మెంట్ లలోని ఫ్లాట్లను ఆ వర్గాలకు చెందిన వారికే కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ అబివృద్ధి చెందిన, అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ఫ్లాట్లే అని బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలతో అమ్ముతున్నారు. ఏడాదికి ఆరు లక్షల రూపాయల (నెలకు రూ.50 వేలు ) ఆదాయం ఉన్న వారికే వీటిని కేటాయించనున్నారు.
వీటిలో హైదరాబాద్ గచ్చిబౌలి లోని 111 ఫ్లాట్లు, వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని అపార్ట్ మెంట్ లో 102 ఫ్లాట్లు , ఖమ్మంలో శ్రీరామ్ హిల్స్ వద్ద 126 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకమైన విధానంలో లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఫ్లాట్ల విస్తీర్ణం 450 చదరపు అడుగుల నుంచి 650 చదరపు అడుగుల వరకు ఉంటుంది.
గచ్చి బౌలి ప్రాంతంలోని ఫ్లాట్ల ధర రూ.26 లక్షల నుంచి గరిష్టంగా 36.20 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. అలాగే ఖమ్మం, వరంగల్ లో రూ.19 -21.50 లక్షలకు, ఖమ్మంలో రూ.11.25 లక్షలకే అందుబాటులోకి తెచ్చారు. ప్రాంతాల్లోని ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లోనూ, మీ సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. గచ్చిబౌలి ప్రాంతం ఫ్లాట్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ జనవరి 6 వ తేదీన, వరంగల్ లోని ఫ్లాట్ల కేటాయింపు జనవరి 8న, ఖమ్మం ఫ్లాట్ల లాటరీ జనవరి 10 వ తేదీన నిర్వహిస్తారు. ఈ విక్రయాలకు సంబధించిన వివరాలన్నీ కూడా హౌసింగ్ బోర్డు వెబ్ సైట్ https://tghb.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
