తెలుగు360 సర్వే : కంచుకోటలో టీడీపీ పరిస్థితి మెరుగుపడిందా..? జనసేన దెబ్బ ఎవరికి..?

జిల్లాల వారీగా తెలుగు 360 అందిస్తున్న సర్వేల్లో భాగంగా ఈ రోజు… తూర్పుగోదావరి జిల్లాల ఫలితాలను చూద్దాం…!. ఎలాంటి పక్షపాతం లేకుండా… అభిప్రాయసేకరణ జరిపి.. అందిస్తున్న ఫలితాలు ఇవి. సర్వేల ద్వారానో… ఓపీనియన్ పోల్స్ ద్వారానో.. ఓటర్లు ప్రభావితం అవుతారని… తెలుగు 360 భావించడం లేదు. అందుకే.. ఫలితాలను నిర్భయంగా ప్రకటిస్తున్నాం. వివిధ పార్టీల అభిమానులు, కార్యాకర్తలకలకు , నేతలకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అన్నింటినీ మేం గౌరవిస్తాం..!

తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు అత్యధిక స్థానాలు గెలిస్తే.. వారికే అధికారం. 19 శాసనసభ నియోజకవర్గాలు … ఈ జిల్లాలో ఉన్నాయి. 2014లో తెలుగుదేశం 12 చోట్ల ఘన విజయం సాధించింది. బీజేపీకి ఇచ్చిన ఓ స్థానంలో ఆ పార్టీని గెలిపించింది. వైసీపీ ఐదు స్థానాలతో సరి పెట్టుకుంది. ఈ ఐదుగురిలో ముగ్గురు టీడీపీ గూటికి చేరారు. ఆవిర్భావం నుంచీ తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. ఈ సారి టీడీపీ, వైసీపీ, జనసేన.. జిల్లాలో ప్రధానంగా పోటీ పడుతున్నాయి. పింఛన్లు, సీసీ రోడ్లు, పేదలకు ఇళ్లు, నూరు శాతం ఎల్‌ఈడీ లైట్ల, తాగునీటి పంపిణీ, యువతకు ఉపాధి, పూర్తయిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కాపు సామాజిక వర్గానికి కార్పొరేషన్‌ టీడీపీకి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. పాదయాత్రతో ఆదరణ పెరిగిందని.. వైసీపీ అనుకుంటోంది. సామాజికవర్గ బలంతో.. జనసేన కూడా.. దైర్యంగానే ఉంది. ఇప్పుడు సీట్లలో ఎవరెవరు గెలిచే అవకాశం ఉందో చూద్దాం.. !

రాజమండ్రి అర్బన్‌ సీటులో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవాని పోటీ చేస్తున్నారు. ఈమె మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు, ఎర్రన్నాయుడు కుమార్తె. రామ్మోహన్ నాయుడు సోదరి. కుటుంబానికి రాజమండ్రిలో మంచి రాజకీయ పలుకుబడి ఉంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఇవ్వడంతో… పోటీ చేసే అవకాశం టీడీపీ నేతలకు దక్కలేదు. వైసీపీ తరపు నుంచి రౌతు సూర్యప్రకాశరావు పోటీ చేస్తున్నారు. ఉండవల్లికి అత్యంత ఆప్తుడయిన ఆయన ..గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జనసేన పార్టీ తరపున అత్తి సత్యనారాయణను నిలబెట్టారు. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి ఉన్న పట్టు.,. టీడీపీ క్యాడర్ స్థిరంగా ఉండటం.. కార్పొరేషన్ పరిధిలో.. అత్యధికం టీడీపీ చేతిలోనే ఉండటంతో.. మొగ్గు .. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ వైపే ఉంది. రాజమండ్రి రూరల్ నియోజవకర్గంలో సీనియర్ నేత.. గోరంట్ల బుచ్చయ్యచౌదరికి.. ధీటైన ప్రత్యర్థి లేరు. వైసీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆకుల వీర్రాజు, జనసేన తరపున మాజీ కాంగ్రెస్ నేత కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. కడియం మండంలపై… గోరంట్ల పూర్తి స్థాయి పట్టు సాధించడంతో.. ఆయన విజయంపై ఢోకా లేదు. తునిలో టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోకూడా పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా ఆరుసార్లు గెలిచిన యనమల తర్వాత నియోజకవర్గంపై పట్టుకోల్పోయారు. జనసేన తరపున బరిలోకి దిగిన… మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఈ సారి ముగ్గురి మధ్య చాలా భీకరమైన పోటీ జరగబోతోంది కానీ… ఫలితం మాత్రం..జనసేన అభ్యర్థికి అనుకూలంగా రావడానికే ఎక్కువ అవకాశం ఉంది. పత్తిపాడులో టీడీపీ తరపున వరుపుల రాజా పోటీ చేస్తున్నారు. అయితే.. టీడీపీలో ఎప్పుడూ ఉండే పర్వత కుటుంబం ఈ సారి వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తోంది. డీసీసీబీ చైర్మన్‌గా వరుపుల రాజా దూకుడుగా ఉండటంతో పాటు.. క్యాడర్ సపోర్ట్ ఉండటంతో.. ఆయనకే మెరురైన అవకాశం కనిపిస్తోంది. రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున బొంతు రాజేశ్వర్ రావు పోటీ చేస్తున్నారు. జనసేన తరపున మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బరిలో ఉన్నారు. త్రిముఖ పోరు.. పార్టీల బలం… అండగా ఉన్న వర్గాలను.. అంచనా వేసుకుంటే.. గొల్లపల్లి సూర్యారావు ముందంజలో ఉన్నారు. అక్కడ టీడీపీకి ఫలితం అనుకూలంగా రానుంది.

గన్నవరం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ఎమ్మెల్యే ఎమ్మెల్యే పులవర్తి నారాయణమూర్తికి చాన్సివ్వలేదు. దళిత నేత నేలపూడి స్టాలిన్‌ టికెట్‌ ఇచ్చారు. వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు, పాముల రాజేశ్వరి ఇద్దరూ టిక్కెట్ ఆశించారు. చివరికి చిట్టిబాబు వైసీపీ తరపున, రాజేశ్వరి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. హోరాహోరీ పోరులో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు విజేతగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అమలాపురం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మళ్లీ పోటీ చేస్తున్నారు. చివరి వరకు ఆయనకు టిక్కెట్ ఖరారు కాకపోయినా.. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ వర్గం పట్టుబట్టి టిక్కెట్ ఇప్పించుకుంది. వైసీపీ తరపున మాజీ మంత్రి పినిపె విశ్వరూప్, జనసేన తరపున శెట్టిబత్తుల చిట్టిబాబు పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ తరపున పోరాటం ఉండనుంది. టీడీపీకి నియోజకవర్గం మొత్తం ఏకపక్షంగా మద్దతు ఉండటంతో.. ఈ సారి ఐతాబత్తున ఆనందరావే మరోసారి గెలవనున్నారు. అనపర్తి టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డికే మళ్లీ టికెట్‌ ఇచ్చారు. అరవై శాతం రెడ్డి సామాజికవర్గ ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో టీడీపీ స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ సారి ఇది వైసీపీ ఖాతాలోనే పడనుంది. ఇక్కడ జనసేన అభ్యర్థి నామమాత్రమే.

కాకినాడ సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జనసేన నేత.. ముత్తా శశిధర్ మధ్య హోరాహీరో పోరు సాగనుంది. మత్య్సకార వర్గానికి చెందిన కొండబాబు.. ఈ నియోజకవర్గంలో.. ముందుండే అవకాశం ఉంది. రెడ్డి సామాజికవర్గం తక్కువ ఉండటం.. వైసీపీ ఓటు బ్యాంక్‌ను.. ముత్తా శశిధర్ చీల్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కాకినాడ రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, జనసేన తరపున పంతం నానాజీ పోటీ పడుతున్నారు. ఇక్కడ టీడీపీ వర్గపోరుతో.. దెబ్బతిననుదంని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కన్నబాబు.. ఆధిక్యత చూపించనున్నారు.

పిఠాపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వర్మ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అన్యాయం జరిగిందనే భావనతో నియోజకవర్గ ప్రజలంతా.. అండగా నిలిచారు. దాదాపుగా యాభై వేల మెజార్టీ వచ్చింది. ఈ సారి టీడీపీలో ఆయనకు పోటీ లేదు. వైసీపీ తరపున పెండెం దొరబాబు, జనసేన తరపున మాకినీడి శేషుకుమారి పోటీ చేస్తున్నారు. వర్మకు కాపుల మద్దతు ఉంది. ఆయన నియోజకవర్గంలో పట్టు సాధించారు. వైసీపీ, జనసేన మధ్య ఓట్లు చీలిపోయి… వర్మ మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయి. పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి చివరి క్షణంలో.. తోట నరసింహం భార్యను రంగంలోకి దింపారు. దీంతో..అప్పటి వరకూ.. పార్టీని నమ్ముకున్న ఇన్‌చార్జి తోట సుబ్బారావు టీడీపీలో చేరిపోయారు. జగ్గంపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబుకు పోటీ ఇస్తున్నారు. జనసేన నుంచి అభ్యర్థి ఉన్నా.. జ్యోతుల కుటుంబీకుల మధ్యే పోటీ జరగనుంది. జ్యోతుల నెహ్రూ.. ఇతర వర్గాల మద్దతు కూడా పొందారు. దాంతో ఆయనకే ఈ సారి కూడా విజయావకాశాలు ఉన్నాయి.

ముమ్మిడివరంలో టీడీపీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిపై గట్టి నమ్మకంతో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిపై చివరి వరకు గందరగోళం ఉంది. చివరికి పొన్నాడ సతీశ్‌ అనే మాజీ ఎమ్మెల్యేను తీసుకొచ్చారు. దీంతో.. అప్పటి వరకూ అక్కడ ఖర్చు పెట్టుకున్న పితాని బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకుని.. జనసేనలో చేరారు. అక్కడ.. వర్గాల మధ్య ఓట్ల చీలికతో.. వైసీపీకే మెరుగైన ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. మండపేటలో సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తిరిగి పోటీ చేస్తున్నారు. వైసీపీ ఇన్చార్జ్ గా ఉన్న వేగుళ్ల లీలా కృష్ణ కు జగన్ హ్యాండివ్వడంతో.. ఆయన జనసేనలో చేరి పోటీ చేస్తున్నారు. చివరికి .. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు… టిక్కెట్ ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీనే సునాయాసంగా విజయం సాధించే పరిస్థితి ఉంది.

రామచంద్రాపురంలో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులే పోటీ చేస్తున్నారు. ఆయనపై చాలా కాలం పాటు పోరాడిన.. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చారు. జనసేన తరపున పోలిశెట్టి చంద్రశేఖర్ రేసులో ఉన్నా… ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే ముందంజలో ఉంది. రాజమండ్రి సిటీని అనుకుని ఉండే రాజానగరంలో టీడీపీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ మరోసారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి జక్కంపూడి రాజాబరిలో ఉన్నారు. జనసేన నుంచి బరిలో ఉన్న రాయపురెడ్డి ప్రసాద్ వైసీపీ ఓట్లు చీల్చే అకాశాలున్నాయి. దీంతో.. టీడీపీ అభ్యర్థి వెంకటేశ్ మరోసారి విజయబావుటా ఎగురవేయనున్నారు. రంపచోడవరంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజేశ్వరికి టీడీపీ టికెట్‌ లభించింది. వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మిని నిలబెట్టారు. ఇక్కడ అభ్యర్థుల కన్నా పార్టీలే కీలకం. వైసీపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్తపేటలో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోటీ చేస్తున్నారు. జనసేన తరపున బండారు సోదరుడే రంగంలో ఉన్నారు. గతంలో బండారు సత్యానందరావు పీఆర్పీ తరపున విజయం సాధించారు. దీంతో.. ఈ సారి బండారు శ్రీనివాసరావుకే విజయావకాశాలు ఉన్నట్లు అంచనా వేయవచ్చు.

AreaParty
తుని జనసేన
పత్తిపాడు టీడీపీ
పిఠాపురం టీడీపీ
కాకినాడ గ్రామీణ వైసీపీ
పెద్దాపురం టీడీపీ
అనపర్తి వైసీపీ
కాకినాడ సిటీ టీడీపీ
రామచంద్రాపురం టీడీపీ
ముమ్మిడివరం వైసీపీ
అమలాపురం
టీడీపీ
రాజోలు (ఎస్సీ) టీడీపీ
గన్నవరం (ఎస్సీ) వైసీపీ
కొత్తపేట జనసేన
మండపేట టీడీపీ
రాజానగరం టీడీపీ
రాజమండ్రి సిటీ టీడీపీ
రాజమండ్రి గ్రామీణ టీడీపీ
జగ్గంపేట టీడీపీ
రంపచోడవరం వైసీపీ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close