తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం శుక్రవారం) సుప్రీంకోర్టు ముందుకు రానుంది.
సుప్రీంకోర్టు విచారణకు కేవలం ఒకరోజు ముందు పోచారం శ్రీనివాస్ రెడ్డి , కాలె యాదయ్య *లపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. వీరు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గతంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలపై ఇదే తరహా తీర్పు వెలువడగా, ఇప్పటివరకు మొత్తం 10 మందిలో ఏడుగురికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.
గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్‌కు ఇచ్చిన సమయం ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని గతంలో ధర్మాసనం హెచ్చరించింది. అయితే, స్పీకర్ ఇప్పటికే 70 శాతం పిటిషన్లను పరిష్కరించినట్లు కోర్టుకు నివేదించే అవకాశం ఉంది. ఈ క్రమంలో, పిటిషన్లను కొట్టివేసిన తీరును బీఆర్ఎస్ న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉంది. కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది రేపటి విచారణలో తేలనుంది.
స్పీకర్ నిర్ణయాలపై బీఆర్ఎస్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీ కండువాలు కప్పుకున్న దృశ్యాలు ప్రపంచమంతా చూసినా, స్పీకర్ ఆధారాలు లేవు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు స్పీకర్ తీర్పులపై అసంతృప్తి వ్యక్తం చేసి, కఠిన ఆదేశాలు జారీ చేస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక ఇబ్బందిగా మారుతుంది. స్పీకర్ అధికారాన్ని ప్రశ్నించకపోతే ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా సేఫ్ అనుకోవచ్చు.


