ఈ శుక్రవారం 8 సినిమాల సందడి

సినిమా రిలీజ్ శుక్రవారం పెట్టుకునే సెంటిమెంట్ ఎప్పటినుండి వచ్చినదో ఏమో కాని.. శుక్రవారంవచ్చిందంటే చాలు వరుసగా సినిమాలు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సినిమా రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈ శుక్రవారం 8 సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం.

ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే పివిపి బ్యానర్ నుండి వస్తున్న ‘క్షణం’ తో మొదలుపెట్టాలి. టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం ఫేవరేట్ సినిమాగా నిలుస్తుంది. ఇక అక్కినేని నాగార్జున అండదండలతో వస్తున్న సినిమా ‘పడేశావే’ కూడా ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. వీటితో పాటుగా సీనియర్ హీరో శ్రీకాంత్ మరోసారి తన ప్రయత్నంగా ‘టెర్రర్’ అంటూ దండయాత్రకు వస్తున్నాడు. ఇక వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఎలుకా మజాకా’ కూడా ఈ వీకెండ్ రిలీజ్ అవుతుంది.

అయితే వీటితో పాటుగా ఎప్పుడు తీశారో తెలియని ‘రాజుగారి ఇంట్లో ఏడో రోజు’, ‘వీరి వీరి గుమ్మడి పండు’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఇవే కాకుండా డబ్బింగ్ సినిమాలు కూడా ఈ వారం పోటీకి వస్తున్నాయి. జయం రవి నటించిన ‘మిరుధన్’ సినిమా ‘యమపాశం’గా రిలీజ్ అవుతుండగా హాలీవుడ్ సినిమా గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుంది.

మొత్తానికి శుక్రవారం వచ్చినదంటే కొత్త సినిమా సందడితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నా వీటిలో ఏది వారు మెచ్చే సినిమా అవుతుందో మరి. క్షణం, పడేసావే సినిమాలు మంచి పబ్లిసిటీతో ముందుకు వస్తున్నాయి. మరి ఈ 8 సినిమాల్లో ఏ సినిమా విజయ బావుటా ఎగురవేస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close