టాలీవుడ్ లో పేరెన్న దగిన నిర్మాతల్లో ఆయన ఒకరు. చేతిలో సక్సెస్లు ఉన్నాయి. బోలెడన్ని ప్రాజెక్టులు సెట్ చేస్తుంటారు. ఎప్పుడూ బిజీగా ఉండే ప్రొడ్యూసర్. అయితే ఓ వీక్నెస్ కూడా వుంది. కథానాయికలతో చాలా సన్నిహితంగా మెలుగుతుంటారు. వాళ్లకు ఖరీదైన బహుమానాలు ఇస్తుంటారు. వాళ్లు కూడా ఈ నిర్మాతని అంతే.. గౌరవిస్తుంటారు. ఆయన సంస్థలో ఓ సినిమా చేసిన కథానాయిక ప్రస్తుతం ఈ నిర్మాత చేతిలో కీలుబొమ్మగా మారిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ సినిమా ఒప్పుకోవాలన్నా, ఓ ప్రాజెక్ట్ పై సంతకాలు చేయాలన్నా… ఆ నిర్మాత గైడెన్స్ తప్పని సరి. ‘ఈ సినిమా నువ్వు చేయ్..’ అంటే చేస్తుంది. ‘వద్దు’ అంటే ఆగిపోతోంది. అంతలా ఆ కథానాయికని గైడ్ చేయగలుగుతున్నారు ఈ ప్రొడ్యూసర్.
ఇటీవల దుబాయ్ వెళ్లి, రూ.50 లక్షలు ఖర్చు పెట్టి షాపింగ్ కూడా చేశారని, దాంతో.. ఆ హీరోయిన్ మరింత ఫిదా అయిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సినిమా చేస్తున్నప్పుడు నిర్మాతలు హీరోయిన్ ని పాంపరింగ్ చేస్తుంటారు. సినిమా అయిపోయిన తరవాత కూడా ఆ రిలేషన్ కొనసాగుతోందంటే సమ్ థింగ్ ఏదో నడుస్తుందనే అనిపిస్తోంది. ఈ కథానాయికతోనే కాదు, ఈ సంస్థలో ఎవరు చేసినా, ఆ హీరోయిన్ ని ఈ నిర్మాత ఇలానే పాంపరింగ్ చేస్తుంటారని, పారితోషికం కంటే ఇచ్చే గిఫ్టులే ఖరీదని జోకులు వేసుకొంటున్నారు వీళ్ల వ్యవహారం తెలిసినవాళ్లు.