ఎన్నికల కోసం టీఆర్ఎస్ బడ్జెట్ రూ. 2వేల కోట్ల ఖర్చు..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్… ఎన్నికల కోసం.. రూ. 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని.. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని… ప్రజాకూటమి నేతలు సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ లోగా మరో రూ. వెయ్యి కోట్లను పంచబోతున్నట్లు తమకు స్పష్టమైన సమాచారం ఉందంటున్నారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మరింత తీవ్రమైన విమర్శలు చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్‌ రూ.50వేల కోట్లు దోపిడీ చేసినట్లు లెక్కలు ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేతల మీద ట్యాపింగ్‌, ట్రాకింగ్‌ కుట్రలు చేస్తున్నారని.. ఆరోపించారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అభ్యర్థులు పెట్టిన ఖర్చు ఎంతని ప్రశ్నించారు.

కేసీఆర్ జుట్టు మోడీ చేతుల్లో ఉందని ..పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈఎస్‌ఐ భవన నిర్మాణ కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కుంభకోణంలో ఏ-1గా కేసీఆర్ ఉన్నారన్నారు. కంటి శస్త్రచికిత్స పేరుతో ఢిల్లీ వెళ్లి.. కేంద్ర ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగి ఛార్జిషీట్‌లో తన పేరును తొలగించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఛార్జిషీట్‌లో కేసీఆర్‌ పేరు కూడా ఉందన్నారు. అలాగే సహారా కేసులో ప్రజాధనం దుర్వినియోగానికి ప్రధాన నిందితుడు కేసీఆరేనన్నారు. గతంలో… బతుకమ్మ సంబరాలు జరుగుతున్నప్పుడు… గవర్నర్ తో కలిసి.. ఆ వేడుకల్లోకేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. కానీ అదే సమయంలో సీబీఐ రావడంతో రోజు మొత్తం విచారణలో ఉన్నారని రమణ గుర్తు చేశారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిన అక్రమాలన్నింటినీ బయటపెడతామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోయినా ఎందుకు ప్రశ్నించడంలేదని ప్రజాకూటమి నేతలు కేసీఆర్‌ను నిలదీశారు. సోనియాపై.. కేసీఆర్ విమర్శలు చేయడాన్ని ఖండించారు. మేడ్చల్‌ సభలో సోనియా చాలా హుందాగా విమర్శలు చేస్తే.. రాహుల్‌, సోనియా, చంద్రబాబులపై కేసీఆర్‌ విమర్శల తీరు హేయమైనదన్నారు. చంద్రబాబు తెలంగాణలో ఏ పథకాన్ని అడ్డుకున్నారో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖర్చుపై.. రోజుకో రచం ప్రచారం జరుగుతోంది. అవన్నీ చాలా పెద్ద స్థాయిలోనే ఉంటున్నాయి. తాజాగా ప్రజాకూటమి నేతల ఆరోపణలతో .. మరింత సంచలనాత్మకమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close