పేరుకే ఫ్యామిలీ సినిమా….

అల్లు శిరీష్ ఆశ‌ల‌న్నీ’ శ్రీ‌ర‌స్తు… శుభ‌మ‌స్తు’ పైనే. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసుకొని ఆగ‌స్టు 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్పుడు సెన్సార్ కూడా పూర్త‌యిపోయింది. అయితే సెన్సార్ వాళ్లు ఇచ్చిన స‌ర్టిఫికెట్ చూస్తుంటే ఈ సినిమాపై కొన్ని సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. సినిమా టైటిల్‌, పోస్ట‌ర్లు చూస్తుంటే క‌చ్చితంగా ఇది ఫ్యామిలీ సినిమానే అనిపిస్తుంది. అందులో అనుమానాల్లేవు. సాధార‌ణంగా ఇలాంటి సినిమాల‌కు క్లీన్ ‘యూ’ స‌ర్టిఫికెట్ ఆశిస్తారు. కానీ సెన్సార్ మాత్రం ఈ సినిమాకి యుబైఏ ఇచ్చింది. దాంతో.. ఈ సినిమాలో ఏమైనా కొన్ని అభ్యంత‌ర క‌ర‌మైన స‌న్నివేశాలున్నాయా? అనే డౌటు వ‌స్తోంది.

ఆ అనుమానానికి ప్ర‌చార చిత్రం కూడా బ‌లాన్ని చేకూరుస్తోంది. ఫ‌స్ట్ షాట్‌లోనే లావ‌ణ్య త్రిపాఠి ఎద భాగాన్ని క్లోజ‌ప్‌లో జూమ్ చేసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. శిరీష్ కూడా లావ‌ణ్య‌ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ గిల్లేస్తున్నాడు. దాంతో ఈసినిమాలో కాస్త గ్లామ‌ర్ డోస్ కూడా ఉండే ఉంటుంద‌నిపిస్తోంది. ఓ పాట‌లో లావ‌ణ్య త్రిపాఠి బ‌హు గ్లామ‌ర్‌గా క‌నిపించింద‌ని, ఆ పాట… కొన్ని చిన్న చిన్న బిట్ సీన్ల‌కు యుబై ఏ ఇవ్వాల్సివ‌చ్చింద‌ని చెబుతున్నారు. అంటే పేరుకే ఫ్యామిలీ సినిమా అన్న‌మాట‌. కుర్రాళ్ల‌కు కావ‌ల్సిన కంటెంట్ ఇందులోనూ పుష్క‌లంగా జోడించార‌న్న‌మాట‌. మ‌రి అది ఏ మోతాదులో అన్న‌ది సినిమా చూస్తే గానీ తెలీదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com