అమెరికాలో పుట్టే వారికి లభించే పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేయలేరని ఫెడరల్ కోర్టు తేల్చి చెప్పింది. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. సియాటెల్ కోర్టు ఇచ్చిన ప్రిలిమినరీ ఇంజక్షన్ ను ఫెడరల్ అప్పీళ్ల కోర్టు సమర్థించింది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి ఉంది.
2025 జనవరి 20న రెండో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజున ‘ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజన్‌షిప్’ పేరుతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ఆదేశం ప్రకారం, అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ పౌరసత్వం ఇవ్వరు. వారి తల్లులు చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాపై ఉంటే, తండ్రులు అమెరికన్ పౌరులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్లు కాకపోతే వారికి పౌరసత్వం ఇవ్వరు.
అయితే ఇదిఅమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ఉత్తర్వు అని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వాషింగ్టన్, ఆరిజోనా, ఇలినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలు అలాగే కొంత మంది గర్భిణి స్త్రీలు ఇది రాజ్యాంగానికి విరుద్ధమని, ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ను ఉల్లంఘిస్తుందని వాదించారు. ఫిబ్రవరిలో సియాటెల్ కోర్టు యూనివర్సల్ ప్రిలిమినరీ ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో అప్పీళ్ల కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సరిగ్గా తీర్పు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పలు అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఐదు ఫెడరల్ కోర్టులు ఈ ఆర్డర్‌ను రద్దు చేశాయి. ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.