ఏఐ భయాలతో భారత ఐటీ కంపెనీల షేర్లు పడిపోతున్నాయి. కానీ ఇదంతా భయమేనని భారత ఐటీ కంపెనీలకు ఎలాంటి లోటు ఉండకపోగా.. మరింత ప్రాధాన్యత పెంచుకుంటాయని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. కానీ భారత ఐటీకంపెనీలు టెక్ ప్రపంచపు ప్లంబర్లు అని జేపీ మోర్గాన్ విశ్లేషణ. ఒక భవనంలో పైపులు, డ్రైనేజీ వ్యవస్థ కంటికి కనిపించకపోయినా, అవి లేకపోతే ఆ ఇల్లు ఎలా నివాసయోగ్యం కాదో, ఆధునిక వ్యాపార ప్రపంచంలో భారత ఐటీ సంస్థలు అందించే బ్యాకెండ్ సేవలు కూడా అంత కీలకమైనవి. కొత్తగా AI , క్లౌడ్ వంటి విప్లవాత్మక సాంకేతికతలు వచ్చినా, వాటిని పాత సాఫ్ట్వేర్ వ్యవస్థలతో అనుసంధానించడం, డేటాను భద్రపరచడం నిరంతరం పర్యవేక్షించడం వంటి పనులను ఈ ప్లంబర్లే చేయాల్సి ఉంటుంది. అంటే, టెక్నాలజీ ఎంత మారినా, ఆ వ్యవస్థలు సజావుగా సాగడానికి అవసరమైన మౌలిక సాంకేతిక నిర్వహణ బాధ్యత భారత ఐటీ రంగంపైనే ఉంటుందని, అందుకే ఈ కంపెనీలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని .
మౌలిక సదుపాయాల నిర్వహణ
ఒక భవనానికి ప్లంబింగ్ వ్యవస్థ ఎంత ముఖ్యమో, ఒక ఆధునిక వ్యాపారానికి ఐటీ వ్యవస్థ అంత ముఖ్యం. పైపుల్లో నీరు నిరంతరం ప్రవహించేలా ప్లంబర్లు ఎలా చూస్తారో, కంపెనీల డేటా నెట్‌వర్క్‌లు, సర్వర్లు , అప్లికేషన్లు విరామం లేకుండా పనిచేసేలా భారత ఐటీ కంపెనీలు చూస్తాయి. AI వంటి కొత్త సాంకేతికతలు వచ్చినా, అవి పని చేయాలంటే వెనుక బలమైన సాఫ్ట్వేర్ పునాది ఉండాలి. ఆ పునాదిని నిర్మించేది, నిర్వహించేది మన ఐటీ సంస్థలే. కాబట్టి, కొత్త టెక్నాలజీలు వచ్చినా పాత వ్యవస్థలను కొత్త వాటితో అనుసంధానించే పని ఎప్పుడూ ఉంటుంది.
AI అమలులో సర్వీస్ ప్రాధాన్యత
చాలామంది AI వల్ల కోడింగ్ ఉద్యోగాలు పోతాయని భయపడుతున్నారు, కానీ ప్రసిద్ధ సంస్థ జెపి మోర్గాన్ విశ్లేషణ ప్రకారం.. AI అనేది ఒక టూల్ మాత్రమే, అది ఒక పూర్తి పరిష్కారం కాదు. ఒక కంపెనీకి AI కావాలంటే, ఆ AI మోడల్‌ను వారి పాత డేటాతో కలపాలి, భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయాలి. నిరంతరం అప్డేట్ చేయాలి. ఈ సంక్లిష్టమైన పనులను AI స్వయంగా చేసుకోలేదు; వీటికి నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఐటీ కంపెనీలు దెబ్బతింటాయని భావించారు, కానీ చివరికి ఆ క్లౌడ్ టెక్నాలజీని కంపెనీలలో ఇంప్లిమెంట్ చేసే కాంట్రాక్టుల ద్వారా మన ఐటీ సంస్థలే భారీగా లాభపడ్డాయి.
‘SaaSpocalypse’ భయం vs వాస్తవం
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న భయం ఏమిటంటే, క్లాడ్ లేదా చాట్ జిపిటి వంటి AIలు సాఫ్ట్వేర్ సేవలను భర్తీ చేస్తాయని. అయితే, పెద్ద పెద్ద గ్లోబల్ బ్యాంకులు లేదా రిటైల్ దిగ్గజాలు తమ అత్యంత కీలకమైన డేటాను కేవలం ఒక AI బాట్‌కు అప్పగించవు. వారికి నమ్మకమైన భాగస్వామి కావాలి. భారత ఐటీ కంపెనీలకు దశాబ్దాల కాలంగా అంతర్జాతీయ క్లయింట్లతో ఉన్న సంబంధాలు, డొమైన్ నాలెడ్జ్ , సెక్యూరిటీ ప్రోటోకాల్స్ వారిని సులభంగా భర్తీ చేయలేని స్థానంలో ఉంచాయి. అందుకే, ప్రస్తుత పతనం ఒక రకమైన అతి జాగ్రత్త వల్ల వచ్చినదే తప్ప, రంగం అంతరించిపోతుందనేది వాస్తవం కాదు.
దీర్ఘకాలిక దృక్పథం
చారిత్రకంగా చూస్తే, ప్రతి కొత్త టెక్నాలజీ విప్లవం వచ్చినప్పుడు ఐటీ రంగం తనను తాను మార్చుకుంటూ వచ్చింది. వై2కే నుండి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వరకు ప్రతి దశలోనూ భారత కంపెనీలు కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వృద్ధి చెందాయి. ఇప్పుడు కూడా AIని ఒక ముప్పుగా కాకుండా, ఒక ఉత్పాదకత పెంచే సాధనంగా వాడుకుంటే, ఈ కంపెనీల లాభదాయకత మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే విశ్లేషకులు ఈ పతనాన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీ గా చూస్తున్నారు, ఎందుకంటే ప్లంబర్లు లేని ఇల్లు ఎలా ఉండదో, ఐటీ సర్వీసులు లేని ఆధునిక వ్యాపార ప్రపంచం కూడా అలాగే ఉండదు.
