అనిల్ రావిపూడి బలం ఎంటర్టైన్మెంట్. దానితోనే వరుస విజయాలు అందుకొన్నారు. కథ ఎలాగున్నా… ఏదోలా నవ్వించేసి, ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ తో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రావిపూడి విజయాల్లో కీలక పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవబోతున్నారు. ఆయన దాదాపు 20 నిమిషాల పాటు కనిపించబోతున్నారు. ఓ పాట, ఓ ఫైట్, కొన్ని కామెడీ సీన్నివేశాల్లో మెరవబోతున్నారు. వెంకీకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది.
ఈ సినిమాలో వెంకీ, చిరులపై రావిపూడి ఓ హిలేరియస్ ఎపిసోడ్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ సీన్ దాదాపు 5 నిమిషాలు ఉంటుందని, ఈ ఎపిసోడ్ లో చిరు, వెంకీ సూపర్ హిట్ పాటల్ని మెడ్లీగా వినిపించబోతున్నారని టాక్. సరిగ్గా ప్రీ క్లైమాక్స్ కు ముందు ఈ సీన్ రాబోతోందట. సెకండాఫ్ మొత్తానికి ఈ సీన్ హైలెట్ గా నిలవబోతోందని టాక్. చిరు, వెంకీ… ఇద్దరూ కామెడీ పండించడంలో దిట్ట. ఇద్దరూ కలిశారంటే… ఆ హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి 2 పాటలు బయటకు వచ్చాయి. చిరు, వెంకీలపై తెరకెక్కించిన ఓ పాటని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. రమణ గోగుల పాడిన ఓ పాట కూడా చాలా బాగా వచ్చిందని, జనవరి 1న ఆ పాట బయటకు వచ్చే ఛాన్స్ వుందని టాక్.
