విజయ్‌ దేవరకొండ రెండు మెట్లు దిగినట్టే

నెట్టింట్లో రచ్చ చూసి జడుసుకున్నాడో…. ట్రాల్స్‌ దెబ్బకి భయపడ్డాడో… మరొకటో… ‘గీత గోవిందం’ ఆడియోలో హీరో విజయ్‌ దేవరకొండ రెండు మెట్లు దిగినట్టే కనిపించాడు. ‘అర్జున్‌రెడ్డి’ ఆడియోలో చూసిన హీరోయేనా ఇతను అనుకునేలా కొంచెం తగ్గి మాట్లాడాడు. ‘అర్జున్‌రెడ్డి’లో ఒక వర్డ్‌ మ్యూట్‌ చేసినందుకు స్టేజి మీదే విజయ్‌ దేవరకొండ నానా రచ్చ చేశాడు. యూత్‌ అంతా థియేటర్లలో ఆ బీప్‌ సౌండ్‌ వచ్చినప్పుడు డబ్బింగ్‌ చెప్పాలని కోరాడు.

‘గీత గోవిందం’లో ‘వాట్‌ ద ఎఫ్‌…’ సాంగ్‌ కాంట్రవర్సీకి వచ్చేసరికి అటువంటి ప్రొగ్రామ్స్‌ పెట్టలేదు. సైలెంట్‌ అయ్యాడు. విజయ్‌ దేవరకొండ పాడిన ఈ పాట విషయంలో ఎంత రచ్చ జరిగిందో కొత్తగా చెప్పనవసరం లేదు. లిరిక్స్‌ విషయంలో కొన్ని సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తే… విజయ్‌ పాడిన తీరుపై ఇంటర్‌నెట్‌లో యూత్‌ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ సెటైర్స్‌ అన్నిటినీ విజయ్‌ దేవరకొండ లైటర్‌ నోట్‌లో తీసుకున్నాడు. ‘గీత గోవిందం’ ఆడియోలో ట్రాల్స్‌లో కొన్నిటిని ప్లే చేయించాడు. ‘‘ఓ రెండు రోజులు నన్ను ఎంత గట్టిగా వేసుకున్నారబ్బా’’ అని అన్నాడంటే విజయ్‌ దేవరకొండ మీద ట్రాల్స్‌ ఎఫెక్ట్‌ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా? ‘‘బన్నీ అన్నా… ఎంత రచ్చ జరిగిందో నువ్వు చూశావా’’ అని అడిగాడు. అందుకు తెలుసు అన్నట్టు బన్నీ తల ఊపాడు. ప్రేక్షకులకు తన సింగింగ్‌ నచ్చలేదని అర్థమైనట్టు చెప్పుకొచ్చాడు. లిరిక్స్‌ కూడా మార్చారు. ‘వాట్‌ ద ఎఫ్‌’ సాంగ్‌లోని ‘ఎఫ్‌’ కాస్తా ‘లైఫ్‌’ అయ్యింది. కొత్త పాటను ఈ రోజు విడుదల చేశారు.

పాటలో లిరిక్స్‌ మార్చడం ఒకటి అయితే… సింగర్‌ని కూడా మారుస్తానని విజయ్‌ దేవరకొండ అంటున్నాడు. సినిమాలో పాట పాడింది అతనే. ఇప్పుడు ప్రేక్షకులను పాడి పంపించమంటున్నాడు. ‘గీత గోవిందం’ టీమ్‌కి ఎవరి వాయిస్‌ అయితే నచ్చుతుందో వాళ్లతో సినిమాలో పాడిస్తానని ఆడియన్స్‌కి ఆఫర్‌ ఇచ్చాడు.

‘అర్జున్‌రెడ్డి’ టైమ్‌లో విజయ్‌ దేవరకొండకి యూత్‌ నుంచి ఎక్కువ సపోర్ట్‌ లభించింది. ఇప్పుడు అదే యూత్‌ ఏ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇంటర్‌నెట్‌లో ఎక్కువశాతం ట్రాల్స్‌ చేసేది వాళ్లే కదా! వాళ్లకు విజయ్‌ దేవరకొండ సింగింగ్‌ నచ్చలేదు. దాంతో కాంట్రవర్సీ చేసినట్టు లేడు. సింగర్‌గా తన లాంఛింగ్‌ ఫెయిల్‌ అయ్యిందని స్టేజి మీద విజయ్‌ దేవరకొండ అంగీకరించడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close