లిక్కర్ కేసులో చెప్పాల్సింది చాలా ఉందని విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు పిలిస్తే.. చాలా పనులున్నాయి… పది రోజుల తర్వాత వస్తానని సమాచారం పంపారు. ఆయనకు తెలిసిన సంచలన విషయాలు చాలా ఉంటాయి. పద్దతిగా మాట్లాడి తెలుసుకుందామని అనుకుంటున్నారేమో కానీ సిట్ అధికారులు వెయిట్ చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి అంత అంత తీరిక లేని పనులు ఏం చేస్తున్నారా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
లిక్కర్ కేసులో జగన్ రెడ్డే అసలు స్కామర్. పాత్రధారులందరికీ తలా కొద్ది మొత్తం ఇచ్చి.. మిగతా 90 శాతం తానే నొక్కేశారని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో మొదట విజయసాయిరెడ్డి ఉన్నారు. తర్వాత ఆయనను తప్పించారు. మొత్తం రాజ్ కెసిసెడ్డినే చూసుకున్నారు. అందుకే ఆయనకు కోపం ఉందేమో కానీ మొత్తం అయనే చేశారని వాదించడం ప్రారంభించారు. అయితే అసలు స్కామంటూ జరిగితే అది జగన్ రెడ్డి చేసిందేనని అందరికీ తెలిసిపోతుంది. అయినా సరే జగన్కేమీ సంబంధం లేదు.. అంతా కేసిరెడ్డినే చేశారని సిట్ కు చెప్పారు. జగన్ కు సంబంధం ఉందో లేదో తాము తేలుస్తామని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పుడు విజయసాయిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఏ 5గా ఉన్నారు. ఆయనకూ డబ్బు దండిగానే ముట్టిందని ఆధారాలు కనిపెట్టారు. ఆ డబ్బు కూడా అరబిందో ఖాతాల్లోకి వెళ్లింది. తాను అప్పు ఇప్పించానని.. తిరిగి చెల్లించారని విజయసాయిరెడ్డి కథలు చెబుతున్నారని సిట్ అధికారులు గుర్తించారు. ఈ అంశంలో విజయసాయిరెడ్డి పాత్రపై చాలా వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వాటిపై ఆయనను ప్రశ్నిస్తారు. అందుకే విజయసాయిరెడ్డి .. పది రోజుల సమయం తీసుకుని తన సోర్సుల ద్వారా విషయాలు తెలుసుకుని బయటపడకుండా స్కెచ్ వేసుకుంటున్నారని భావిస్తున్నారు.
ఇటీవల కర్మ సిద్ధాంతాన్ని విజయసాయిరెడ్డి పోస్టు చేశారు. నిజంగా ఆయన దాన్ని నమ్మితే.. తాను చేసిన తప్పులు, ఘోరాల నుంచి బయటపడేందుకు తప్పుడు మార్గాలను మళ్లీ ఎంచుకునేందుకు ప్రయత్నించరు. ఎందుకంటే..కర్మ సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఆయన మార్చకోలేరు. జరగాల్సింది జరుగుతుంది.