విశ్లేష‌ణ‌: థియేట‌ర్ల మూత‌… హీరోల బాధ్య‌త ఎంత‌?

డిమాండ్ – సప్లై… వ్యాపారం ఏదైనా స‌రే, కీల‌క‌మైన సూత్ర‌మిదే. సినిమాల‌కూ ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. కాక‌పోతే.. డిమాండ్‌కి త‌గిన స‌ప్లై ఇప్పుడు టాలీవుడ్‌లో క‌నిపించ‌డం లేదు. దాంతో థియేట‌ర్లు మూత‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. యేడాదికి స‌గ‌టున తెలుగు రాష్ట్రాల‌లో 25 థియేట‌ర్ల చొప్పున మూత‌బ‌డుతూ వ‌స్తున్నాయి. అందులో కొన్ని క‌ల్యాణ మండ‌పాలుగా, ఇంకొన్ని గిడ్డంగులుగా మారిపోతున్నాయి. ఇంకొన్ని షాపింగ్ కాంప్లెక్సుల అవ‌తారాలు ఎత్తుతున్నాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే… ఇంకొన్నాళ్ల‌కు సింగిల్ స్క్రీన్ వ్య‌వ‌స్థ పూర్తిగా నాశ‌న‌మ‌య్యే ప్ర‌మాదం ఉంది. ఈ ప‌రిస్థితికి హీరోల ‘బ‌ద్ద‌కం’ కూడా ఓ కార‌ణంగా నిలుస్తోంది.

చిత్ర‌సీమ టాప్ స్టార్ల కెరీర్‌పైనా, వాళ్లు చేసే సినిమాల‌పైనా ఆధార‌ప‌డి ఉంటుంద‌న్న‌ది అక్ష‌ర‌స‌త్యం. చిన్న సినిమాలు చిత్ర‌సీమ‌కు బ‌లం. కాద‌న‌లేం. కాక‌పోతే.. రికార్డు వ‌సూళ్ల గురించి వినే అవ‌కాశం, అదృష్టం.. పెద్ద సినిమాలు వ‌చ్చిన‌ప్పుడే ద‌క్కుతుంది. పైగా ఓ టాప్ స్టార్ సినిమా హిట్ట‌యి, రికార్డులు బ‌ద్ద‌లు కొడితే – ఆ స్ఫూర్తితో మ‌రిన్ని కొత్త సినిమాలు ప్రాణం పోసుకుంటాయి. కొత్త ద‌ర్శ‌కులు వ‌స్తారు. నిర్మాత‌లు త‌యార‌వుతారు. డ‌బ్బు రొటేట్ అవుతుంటుంది. మొత్తానికి ప‌రిశ్ర‌మ‌కి కావ‌ల్సిన ప‌ని దొరుకుతుంది.

ఈ థియరీ హీరోలంతా ఒప్పుకుంటారు కూడా. కానీ కావ‌ల్సిన స్థాయిలో, సంఖ్య‌లో సినిమాలు చేస్తున్నారా? లేదా? అనేదే అతి కీల‌క‌మైన ప్ర‌శ్న‌. మ‌హేష్, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ప్ర‌భాస్‌… ఇలా ఏ టాప్ స్టార్ తీసుకున్నా – యేడాదికి ఒక్క సినిమాతో స‌రిపెట్టేస్తున్నారు. స్పీడు పెంచ‌రా? అని అడిగితే `క‌థ‌లెక్క‌డ‌?` అని ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. 12 నెల‌ల పాటు ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌డం మామూలు విష‌యం కాదు. అది నిర్మాత‌ల‌కు భార‌మే. ఈలోగా వ‌డ్డీల‌ను భ‌రించాల్సివ‌స్తుంది. బ‌డ్జెట్ పెరుగుతూ ఉంటుంది. చివ‌రికి సినిమా విడుద‌లై హిట్ట‌యినా, త‌గిన‌న్ని లాభాలు మాత్రం రావు. సినిమా పోతే.. ఇక చెప్పాల్సిన ప‌ని లేదు. చాలా జీవితాలు రోడ్డున ప‌డ‌తాయి.

సినిమా మేకింగ్ అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఎడిటింగ్‌, డ‌బ్బింగ్ ప్ర‌క్రియ‌లు సుల‌భ‌మైపోయాయి. సీన్ తీస్తున్న‌ప్పుడే ఎడిటింగ్ చేసుకునే సౌల‌భ్యం ఉంది. ఇది వ‌ర‌కు ప్రింట్‌లో సినిమా తీస్తున్న‌ప్పుడు ఇన్ని సౌక‌ర్యాలు లేవు. అలాంట‌ప్పుడు సినిమా ఇంకెంత వేగంగా పూర్త‌వ్వాలి? యేడాదికి ఎన్ని సినిమాలు బ‌య‌ట‌కు రావాలి? కానీ అవేం జ‌ర‌గ‌డం లేదు. దానికి కార‌ణం.. హీరోలు, ద‌ర్శ‌కుల అతి జాగ్ర‌త్తే. స్క్రిప్టు ప‌క్కా అయిన త‌ర‌వాత సెట్స్‌పైకి వెళ్ల‌డం అనేది ఇప్ప‌టి హీరోల‌కు తెలియ‌డం లేదు. షూటింగ్ ద‌శ‌లో క‌థ అనేక మార్పుల‌కు లోన‌వుతుంది. కొత్త పాత్ర‌లు వ‌చ్చిప‌డిపోతుంటాయి. దాంతో షెడ్యూల్ అనుకున్న స‌మ‌యానికి పూర్త‌వ్వ‌దు. రీషూట్ల గురించి ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. ఓ సీన్ చూసుకుని, న‌గిషీలు దిద్దుకుంటూ వెళ్ల‌డం న‌యా ద‌ర్శ‌కుల‌కు ఓ అల‌వాటుగా మారిపోయింది. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర ఇంకెన్ని మార్పులో..?

పూరి జ‌గన్నాథ్‌ల వేగంగా సినిమాలు తీసేవాళ్లు క‌ర‌వైపోయారు. రాజ‌మౌళి సినిమా అంటే రెండేళ్లు ప‌డుతుంది. వంశీ పైడిప‌ల్లి అయితే.. మ‌హ‌ర్షి కోసం రెండేళ్లు స‌మ‌యం తీసుకున్నాడు. కొర‌టాల శివ‌, త్రివిక్ర‌మ్, సుకుమార్‌ల‌దీ అదే ప‌రిస్థితి. ఈ విష‌యంలో హీరోల త‌ప్పు ఎంత ఉందో? ద‌ర్శ‌కుల‌దీ అంతే ఉంది. అతి జాగ్ర‌త్త‌ల‌తో సినిమాలు తీస్తూ… కాలయాప‌న చేస్తున్నారు. అందుకే సినిమాల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. థియేట‌ర్ల‌కు ఫీడింగ్ దొర‌క్క‌పోవ‌డంతో… మూసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తోంది. రాష్ట్రంలో మ‌ల్టీప్లెక్స్‌ల సంఖ్య పెరుగుతూ పోతూ.. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత‌ప‌డుతూ వ‌స్తున్నాయి. ఇది మంచి ప‌రిణామం కాదు. నాని, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, శ‌ర్వానంద్‌లాంటి యువ హీరోలు ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమాలు తీయ‌క‌పోతే… ఈ ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పటికైనా హీరోలు క‌ళ్లు తెర‌వాలి.. సినిమాల స్పీడు పెంచాలి. మీన‌మేశాలు లెక్క‌పెడుతూ, యేడాదికొక‌టి, రెండేళ్ల‌కొక‌టి అంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తే… ఆఖ‌రికి త‌మ సినిమాని తెర‌పై చూసుకోవ‌డానికి థియేట‌ర్లే లేకుండా పోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close