బాబు సర్కార్‌ ఇలా ఉంటే జనానికి డౌట్లు రావా?

కేసీఆర్‌ సర్కారు గోదావరి నది తెలంగాణలో ఎంటర్‌ అయిన దగ్గరినుంచి, తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే పాయింట్‌ వరకు కడుతున్న ప్రాజెక్టులన్నీ ఒక ఎత్తు, కృష్ణానది నీటిని వినియోగించుకోవడానికి ప్లాన్‌ చేస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఒక్కటీ ఒక ఎత్తు. గోదావరి మీద కడుతున్న ప్రాజెక్టులు అన్నీ మిగులు జలాలకు వినియెగానికి సంబంధించినవి. వీటిని వీలైనంత ఎక్కువగా ఎవరు వినియోగించుకున్నప్పటికీ ఇబ్బంది లేదు. కానీ కృష్ణా జలాల విషయం అలా కాదు. ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ జిల్లాలకు నీటి ఎద్దడి తప్పదనే బయాలు ఇప్పటికే విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. పీసీసీ అయితే ఏకంగా 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాలమూరు ప్రాజెక్టు వలన 8 జిల్లాలు ఎడారిగా మారుతాయనే నినాదంతో పోరాటం ప్రారంభిస్తున్నది.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబునాయుడు సర్కారు పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎలాంటి కచ్చితమైన ప్రయత్నమూ చేయడం లేదని ప్రతిపక్షాల నుంచి విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలను ప్రభుత్వం వారు కూడా సూటిగా ఖండించడం లేదు. మరోవైపు చంద్రబాబుతో తమకు పూర్తిస్థాయిలో సయోధ్యకుదిరిపోయినట్లుగా కేసీఆర్‌.. మాటలు ఉంటున్నాయి. చంద్రబాబు తాము ఏం చేసినా వ్యతిరేకించే అవకాశం లేదన్నట్లుగా ఆయన మాటల సంకేతాలు ఉంటున్నాయని జనం అనుకుంటున్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్‌తో కుమ్మక్కు అయిన వ్యవహారంపై జనంలో ఇప్పటికే పలు సందేహాలున్నాయి. ముంపు గ్రామాలను తిరిగి ఇవ్వడానికి బాబు ఒప్పుకున్నారనే కేసీఆర్‌ మాట కూడా జనంలోకి బాగా వెళ్లింది.

అయితే ఆ మాటల్ని చంద్రబాబు ఖండించకపోవడం విశేషం. నీటి పారుదల మంత్రి దేవినేని ఉమా మాత్రమే ఖండించారు. అయితే ఆయన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకోవడం గురించి తమ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పలేదు. ఆ ప్రాజెక్టు అనుమతులు లేకుండా కట్టడం అన్యాయం అక్రమం అంటూ ఆక్రోశిస్తున్నారే తప్ప.. ప్రభుత్వ పరంగా అడ్డుకోడానికి జరుగుతున్న ప్రయత్నాలేమిటో చెప్పడం లేదు. పైగా రైతులు కేసులు వేశారు.. అంటూ తాము చేసింది ఏమీ లేదని ఇండైరక్టుగా అంటున్నారు. సచివులు ఇలాంటి మాటలే చెబుతోంటే.. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునే విషయంలో వారి చిత్త శుద్ధి మీద ప్రజలకు కొత్త డౌట్లు పుట్టుకొస్తాయి కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close