ఎమర్జెన్సీ సరే..గోధ్రాను కూడా ఇలాగే గుర్తు చేసుకుంటుందా బీజేపీ..?

భారతీయ జనతా పార్టీ నేతలు.. ముఖ్యంగా ప్రధానమంత్రి దగ్గర్నుంచి… కింది స్థాయి కార్యకర్త వరకూ.. అందరూ.. ఇందిరాగాంధీ ఎప్పుడో జమానా కింద విధించిన ఎమర్జెన్సీని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అచ్చంగా అది సెలబ్రేషనే. దశాబ్దాల కిందట జరిగిపోయిన ఉదంతాన్ని.. మళ్లీ మళ్లీ గుర్తు చేసి..కాంగ్రెస్….చేసిన తప్పును.. దేశ ప్రజలకు మళ్లీ గుర్తు చేసి.. ఆ పార్టీ మీద వ్యతిరేకతను పెంచి..తనకు ఓట్ల పండగను సృష్టించుకోవడమే ఈ ఎమర్జెన్సీ కార్యక్రమాల ఎత్తుగడ. నిజానికి ఇప్పటి తరానికి ఎమర్జెన్సీ అంటే.. ఏమిటో..వాళ్లు..వీళ్లు చెబితే మాత్రమే తెలుస్తోంది. ఎందుకంటే.. ఆ రోజుల్లో ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లారా చూసిన వాళ్లు.. సీనియర్ సిటిజన్లైపోయారు. కొంత మంది రాజకీయ నేతలు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. బీజేపీలో ఉన్న నేతలే ఇప్పుడు ఆ ఎమెర్జెన్సీని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

నిజానికి ఇందిరాగాంధీనే ఎమర్జెన్సీ విధించారు. ఆమే తొలగించారు కూడా. ఎమర్జెన్సీని విధించినందుకు ప్రజలేమీ ఆమెపై తిరగబడలేదు. కానీ ఎమర్జెన్సీని తొలగించి మళ్లీ ఎన్నికలకు వెళ్లినప్పుడు ప్రజలు ఆమెను శిక్షించారు. మళ్లీ క్షమించారు కూడా. తర్వాత కూడా ఆమె.. ప్రజా తీర్పుతో ప్రధాని అయ్యారు. కానీ బీజేపీ నేతలకు మాత్రం.. ఇదో పండగలా కనిపిస్తోంది. ఇందిగాంధీని హిట్లర్‌తో పోల్చుకుని మరీ సంతోషపడుతున్నారు. ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో… రాటుదేలిపోయిన.. ప్రధానమంత్రి అయితే… తను పాల్గొన్న కార్యక్రమంలో.. కొత్త కథ వినిపించారు. కాంగ్రెస్ కోసం పాట పాడలేదని.. గాయకడు కిషోర్ కుమార్ ను జైల్లో పెట్టారట. దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఇప్పుడీ కబుర్లు దేనికి..?
ఎమర్జెన్సీ నూటికి నూరు శాతం తప్పు.. అందుకని.. యానివర్శరీలు జరపడం దేనికి..? అదే గోధ్రా ఘటనను… అలాగే చేయగలరా..? ప్రపంచలో భారదేశంపై ఓ కమ్యూనల్ ముద్ర వేసిన దారుణామైన గోధ్రా ఘటన… గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఉన్నప్పుడు జరిగింది. ఆ ఘటనలో ఆయనపై తీవ్రమైన అభియోగాలు వచ్చాయి. ఎమర్జెన్సీ కాలంలో ఏం జరిగిందో ఈ తరానికి పూర్తిగా తెలియదు కానీ… సాటి భారతీయుల్ని.. నిస్సంకోచంగా ఊచకోత కోసిన గోద్రా గురించి మాత్రం బాగా తెలుసు. మరి ఈ ఘటనకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేరా..? బాబ్రీ సమీదును కూలగొట్టి.. దేశ ప్రజలను రెండు భాగాలుగా చీల్చిన తేదని ఇలాగే గుర్తు చేసుకుంటారా..?. ఏం చేసినా అంతా రాజకీయమే… కాంగ్రెస్ అనుంటే.. కాంగ్రెస్ ను మించిన విలువల్లేని రాజకీయాలను బీజేపీ చేస్తోంది. ప్రధానమంత్రీ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలకు గేట్లు క్లోజ్!

ఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే పార్టీ మార్పుపై కొంతమంది టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారా..? ఐదేళ్ళు టీడీపీ నేతలను...

రాజీనామా చేసిన వాలంటీర్ల పెడబొబ్బలు !

తమను మల్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు వెనుకాడటం లేదు. వారి బాధ ఇప్పుడు...

క‌థాక‌మామిషు: ఈవారం క‌థ‌ల‌పై రివ్యూ

క‌థా స్ర‌వంతిలో మ‌రో వారం గ‌డిచిపోయింది. ఈవారం (జూన్ 16) మ‌రి కొన్ని క‌థ‌లు పాఠ‌కుల ముందుకు వ‌చ్చాయి. ర‌చ‌నా శైలి ఎలా ఉన్నా, వ‌స్తువులో వైవిధ్యం క‌నిపించ‌డం మంచి ప‌రిణామం. నాన్న...

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close