సుభాష్ – పవన్‌కి ఏమైంది..? ఇంత నిర్లిప్తత ఎందుకు..?

రాజకీయం అంటే నాలుగు గోడల మధ్య చేసేది కాదు..! ప్రజల మధ్య చేసేది..! ప్రజల కోసం చేసేది..!. ప్రజలు ఆదరిస్తే చేసేది..!. ప్రజలు ఆదరించాలంటే.. వారి మధ్యే రాజకీయం చేయాలి. కానీ పవన్ కల్యాణ్… ఎప్పుడో.. క్రిస్మస్‌కి… పది రోజుల ముందు.. క్రిస్మస్ హాలీడేస్ తీసుకోక ముందు.. అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ తర్వతా మళ్లీ ప్రజాపర్యటనలో కనిపించలేదు. ఒకటి ఆరా.. ప్రైవేటు కార్యక్రమాలు పెట్టుకున్నప్పటికీ.. రాజకీయ కార్యాచరణకు అవి ఏ మాత్రం సరిపోయేవి కాదు..!

పోరాటయాత్రలు ఎందుకు ఆగిపోయాయి..?

ఏడాది కిందట.. పవన్ కల్యాణ్ .. పోరాటయాత్ర పేరుతో.. బస్సుయాత్రలు ప్రారంభించారు. ఏడాది తర్వాత కూడా ఆయన పర్యటనలను పూర్తి చేయలేకపోయారు. కేవలం.. ఉత్తరాంధ్రతో పాటు.. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం.. పోరాటయాత్ర అయిందనిపించారు. అదే…ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. పులివెందుల నుంచి ప్రారంభించి.. ఇచ్చాపురం వరకు ఏడాదిలో పాదయాత్ర పూర్తి చేశారు. అదీ కూడా.. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లినప్పటికీ.. తన పని తాను చేసుకున్నారు. ఈ యాత్రలోనే పార్టీ కార్యక్రమాలు చక్కబెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ చేతిలో బస్సు ఉన్నప్పటికీ… పవన్ కల్యాణ్.. ఐదు జిల్లాలతోనే సరి పెట్టారు. పైగా.. సమయం లేని కారణంగా.. మిగతా జిల్లాల్లో పోరాటయాత్ర లేదని.. అంశాల వారీగా పర్యటనలు ఉంటాయని.. సంక్రాంతి పండుగకు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ.. ఒక్క జిల్లా పర్యటన లేదు. అసలు ఉంటుందో ఉండదోకూడా తెలియని పరిస్థితి.

జనవరి నుంచి ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదేమిటి..?

క్రిస్మిస్ పండుగను యూరప్‌లో చేసుకుని నేరుగా… విజయవాడ వచ్చినప్పటికీ.. పవన్ కల్యాణ్.. రాజకీయ కార్యాచరణ పరంగా.. చేసిందేమీ లేదు. కొన్ని కమిటీల నియామకంపై కసర్తులు, అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయడం. పెంటపాటి పుల్లారావు, విష్ణురాజు లాంటి వారితో సమావేశాలు జరపడం.. తప్ప.. ఒక్కటంటే.. ఒక్కటి కూడా నేరుగా ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమం పెట్టుకోలేదు. పెనుగొండలో… ఓ దైవ కార్యక్రమానికి వెళ్లి.. అధికారంలోకి రాగానే.. అక్కడ ప్రాంతం పేరు మారుస్తామని మాత్రం హామీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి చేసిన ఒకే ఒక్క పర్యటన అది ఒక్కటే. అదికూడా.. 150 కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్‌లో వచ్చి వెళ్లారు. అంత అర్జెన్సీ ఉన్న పార్టీ కార్యక్రమాలేమిటో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. టిక్కెట్లు కావాలంటూ వచ్చే వారి ధరఖాస్తులు తీసుకోవడానికి ఓ వ్యవస్థ ఏర్పాటు చేశారు. వారితో కూడా.. పవన్ ఎలాంటి సమావేశాలు నిర్వహించడం లేదు. మేధావుల కేటగరిలో పార్టీలోకి వచ్చే వారికి కండువాలు కప్పి.. వారికి అప్పటికప్పుడు పార్టీలో ఏదో ఓ పదవి ప్రకటించడమే.. ఇప్పటి వరకూ.. పవన్‌కు కంటిన్యూ అవుతున్న షెడ్యూల్.

పవన్ కల్యాణ్ చేతులెత్తేశారన్న ప్రచారం నిజమేనా..?

పవన్ కల్యాణ్ .. పార్టీ కార్యక్రమాలు.. ప్రజల్లో ఎక్కువగా చేపట్టడం లేదు. కేవలం…విజయవాడ పార్టీ ఆఫీసులో మాత్రమే… కొన్ని జరుగుతున్నాయి. వాటి ఫోటోలు మాత్రం ట్విట్టర్‌లో కనిపిస్తున్నాయి. ఎక్కడికైనా ప్రైవేటు కార్యక్రమాలకు వెళ్లి రావాలంటే.. హెలికాఫ్టర్‌లో వెళ్లి వస్తున్నారు. మరి.. ఇతర కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదు. జిల్లాల పర్యటనలు ఎందుకు ఆపేశారు..? ఇవి చాలా మందికి అర్థం కాని విషయం. పవన్ కల్యాణ్.. అనేక కారణాల వల్ల చేతులెత్తేశారన్న ప్రచారం.. ఊపందుకుంటోంది. పార్టీకి ఫండింగ్ చేస్తామని హామీ ఇచ్చిన వారు.. ఇప్పుడు వెనక్కి తగ్గారని… అమెరికా టూర్‌తో పాటు.. వివిధ రకాల ఫండ్ రైజింగ్ సమావేశాల వల్ల కూడా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని.. చెబుతున్నారు. నిధులకు తీవ్రమైన కటకట ఉండటంతోనే.. జిల్లాల పర్యటనలు నిలిపివేశారని అంటున్నారు. మామూలుగా అయితే… రాజకీయ పార్టీల అధినేతలు టూర్‌లకు వెళ్తే… అక్కడ టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు.. ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్‌కి అలాంటి వెసులుబాటు లేదు. ఏ నియోజకవర్గంలోనూ.. బలమైన నేతలు టిక్కెట్లు ఆశించడం లేదు. పెద్దగా ఆర్థిక బలం లేని… అభిమానులు మాత్రమే రేసులో ఉన్నారు. వారు మహా అయితే ఫ్లెక్సీలు కట్టగలరు. అందుకే.. జిల్లాల టూర్లకు వెళ్లలాంటే.. ప్రైవేటు సెక్యూరిటీ భారం నుంచి.. మొత్తం పవన్ కల్యాణ్ తానే చూసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే… జిల్లా టూర్ల లేవని అంటున్నారు.

చేరికలు లేనిది… పోటీపై ఆశల్లేకనేనా..?

జనసేన పార్టీకి కొంత కాలం కిందట మంచి ఊపు వచ్చింది. చాలా మంది ఆ పార్టీలో చేరుతారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కరంటే.. ఒక్కరు కూడా ఆ పార్టీ వైపు చూడటం లేదు. మేధావుల పేరుతో కొంత మందిని చేర్చుకుంటున‌్నప్పటికీ.. వారి వల్ల.. నాలుగైదు ఓట్ల లాభం కూడా రాదు. అసలు వారి ఉపయోగం వేరే ఉంటుంది. పార్టీలో వారిని చేర్చుకున్నా.. చేర్చుకోకపోయినా… వారిని ఉపయోగించుకునే విధం వేరు. ప్రజానాయకులు వేరుగా ఉంటారు. పవన్ ఒక్కడే బలంగా ఉంటే సరిపోదు. క్షేత్ర స్థాయిలో.. అందర్నీ కూడగట్టుకుని బలపేతం అయితేనే విజయం లభిస్తుంది. కానీ.. ఎవరూ పవన్ కల్యాణ్‌ని నమ్మలేకపోవడానికి ఆయన చేతులెత్తేశారన్న ప్రచారం జరగడమే కారమణని.. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి పులిస్టాప్ పెట్టాలంటే.. పవన్ కల్యాణ్…చంద్రబాబు, జగన్‌లకు ధీటుగా… రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించాలి. చేరికలు, టూర్లతో హడావుడి చేయాలి. సాధ్యమవుతుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close