ఎన్టీఆర్‌ని ఎందుకు వ‌దిలేశారో..?!

2017, 2018 సంవ‌త్స‌రాల‌కు గానూ…. సుబ్బిరామిరెడ్డి జాతీయ అవార్డులు ప్ర‌క‌టించారు. ఆన‌వాయితీ ప్ర‌కారం.. హీరోలు, హీరోలంద‌రికీ ఏదో ఓ పేరు చెప్పి అవార్డులు ఇచ్చేశారు. ఆ జాబితాలో లేని హీరో అంటూ లేడు. ఒక్క ఎన్టీఆర్ త‌ప్ప‌. ఎన్టీఆర్ కావాల‌నుకుంటే అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాకి గానూ… అవార్డు ఇవ్వొచ్చు. కానీ… కె.సుబ్బిరామిరెడ్డి ఎన్టీఆర్‌ని విస్మ‌రించారు.

దీనికి కార‌ణం అంటూ ఏమీ లేదు. 2017 సంవ‌త్స‌రానికి గానూ ఉత్త‌మ న‌టుడు ఖాతాలో నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్‌కి కూడా అవార్డు ఇస్తే… బాల‌య్య ఆ ఫంక్ష‌న్‌కి వ‌స్తాడో, రాడో అన్న‌ది సుబ్బిరామిరెడ్డి అనుమానం. అందుకే.. ఆ రిస్కు చేయ‌లేక‌పోయాడు కే.ఎస్‌.ఆర్‌. బాల‌కృష్ణ – ఎన్టీఆర్‌ల మ‌ధ్య దూరం ఇటీవ‌ల త‌గ్గిన‌ట్టే అనిపించింది. ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు ఫంక్ష‌న్‌ని జూనియ‌ర్ వ‌చ్చి వెళ్లాడు. అంత‌కు ముందు అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ లో బాల‌య్య అతిథిగా మెరిశాడు. ఈ తాజా ప‌రిణామ‌ల‌తో ఇద్ద‌రి మ‌ధ్య దూరం తగ్గింద‌నుకున్నారంతా. కానీ… అది అలానే కొన‌సాగుతోంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆ రిస్కు తీసుకోవ‌డం ఇష్టం లేక‌.. బాల‌య్య కోసం ఎన్టీఆర్‌ని వ‌ద్ద‌నుకున్నాడు కేటీఆర్‌. అందుకే సుబ్బిరామిరెడ్డి అవార్డుల జాబితాలో ఎన్టీఆర్ పేరు క‌నిపించ‌లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com