ప్రొ.నాగేశ్వర్ : ఏపీలో బీజేపీదేనా అధికారం..?

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కాకినాడలో ప్రకటించేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో నాలుగు అసెంబ్లీ సీట్ల నుంచి అధికారంలోకి వచ్చేశామని..త్రిపురలో ఒక్క సీటు నుంచి అధికారం సాధించామని.. ఏపీలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే సీట్ల నుంచి అధికారం సాధించబోతున్నామని ఆయన తన వాదన వినిపిస్తున్నారు. అసలు బీజేపీకి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.

20వ శతాబ్దపు జోక్ ఏపీలో బీజేపీ గెలుపు..!

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది అని ఎవరైనా అంటే… అది ఇరవయ్యో శతాబ్దపు జోక్‌గా చెప్పుకోవాలి. అధికారంలోకి వస్తామని చెప్పడం తప్పు కాదు. ఒక్క సీటు కూడా లేని త్రిపురలో అధికారంలోకి రాగలిగారు. అస్సాంలో విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్ లో పీఠం అందించారు. జమ్మూకశ్మీర్‌లోనూ.. అధికారం సంపాదించి పెట్టారు. రాజకీయ వ్యూహాల్లో రామ్‌మాధవ్‌ దిట్టనే. కానీ ఆయన వ్యూహరచన చేసి అధికారంలోకి తీసుకొచ్చిన రాష్ట్రాల్లోని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులేమిటి..? త్రిపురలో దశాబ్దాల పాటు..సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉంది. అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ ఓటింగ్ శాతం 52 శాతం ఉంది. లెఫ్ట్ ఫ్రంట్ వ్యతిరేక ఓటింగ్ 48 శాతం ఉంది. అక్కడ 30 ఏళ్లకు పైగా.. అధికారంలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ఓటు బ్యాంక్ కొంత వ్యతిరేకంగా మారింది. కానీ అక్కడ యాంటీ లెఫ్ట్ ఫ్రంట్.. చురుకుగా లేదు. కాంగ్రెస్ పార్టీ.. యాంటీ లెఫ్ట్ ఫ్రంట్‌కు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది. దాన్ని బీజేపీ యూజ్ చేసుకుంది. కాంగ్రెస్ లీడర్లందర్నీ తన వైపు తిప్పుకుంది. కాంగ్రెస్ మంత్రులు బీజేపీ మంత్రులయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. త్రిపురలో కాంగ్రెస్ బోర్డు బీజేపీగా మారింది అంతే. ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ వర్జినల్ బీజేపీ కావొచ్చు కానీ.. అక్కడ ఎంటైర్ కాంగ్రెస్ బీజేపీగా మారింది. దాని వల్ల యాంటీ లెఫ్ట్ ప్రంట్ కన్సాలిడేట్ అయి అక్కడ బీజేపీ అధికారంలోకి రాగలిగింది.

త్రిపురలో కాంగ్రెస్ బోర్డు బీజేపీగా మారింది..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బోర్డు తిప్పేసుకుని.. జగన్మోహన్ రెడ్డితో సహా బీజేపీలో చేరి… జగన్మోహన్ రెడ్డి బీజేపీ నాయకుడైతే.. ఎన్నికల్లో గెలిస్తే.. అప్పుడు బీజేపీ గెలిచినట్లు అవుతుంది. అది సాధ్యమా..? జగన్మోహన్ రెడ్డి తన పార్టీని వదులుకుంటాడా..? త్రిపురలో కాంగ్రెస్ పార్టీ నేతలు .. తమ పార్టీని వదులుకున్నట్లుగా.. ఇక్కడ వైసీపీ నేతలు అధికారాన్ని వదులుకుంటారా..? .. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఎలా అధికారంలోకి వచ్చింది..?. అధికారంలో ఉన్న చిన్న చిన్న పార్టీలు చాలా ఉన్నాయి. ఆ పార్టీలన్నీ.. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే.. వారి వైపు ఉంటారు. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్ని లాగారు. అలాంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యమా. ఇక అస్సాంలో.. ఎలా సాధ్యమైంది..? అస్సాం ఉద్యమం జరిగి… పదిహేనేళ్ల పాటు రాజకీయంగా పోరాడింది బీజేపీ. అక్కడ… కాంగ్రెస్ పార్టీ పదిహేనేళ్ల పాలనపై వ్యతిరేకత ఉంది. ఆ పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయం లేదు కనుక… బీజేపీ .. ఏజీపీతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీ ఒక్కటి కూడా లేదు. ఇక్కడ జనసేన కానీ.. వైసీపీ కానీ బీజేపీతో పొత్తులు పెట్టుకోవు. అస్సాంలో ఏజీపీ బలమైన పార్టీ. అస్సాంగణపరిషత్ లాంటి.. బలమైన మిత్రపక్షం బీజేపీకి .. ఏపీలో ఎక్కడ దొరుకుంది..?

అస్సాంలో బీజేపీ ప్రతిపక్షం.. ఏపీలో వైసీపీ ప్రతిపక్షం..!

అస్సాంలో బీజేపీ వలసలను ప్లాన్డ్‌గా ప్రొత్సహించింది. ఓ నాయకుడ్ని అస్సాం గణపరిషత్ నుచి మరో నాయకుడ్ని కాంగ్రెస్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ వ్యూహరం బాగా పని చేసింది. ఆంధ్రలో కూడా అదే టెక్నిక్‌తో కన్నా లక్ష్మినారాయణను పార్టీలో చేర్చుకున్నారు. వైసీపీలో చేరేబోయే ముందు.. బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తామని ఆశ పెట్టి.. నిలిపేశారు. కన్నాను తెచ్చుకున్నాం కాబట్టి.. అధికారంలోకి వస్తామన్న భ్రమలో ఉన్నారు. అస్సాంలో ఏజీపీ నుంచి పార్టీలో చేర్చుకున్న శర్బానంద సోనోవాల్ అంత పాపులర్ లీడర్ కాదు..కన్నా లక్ష్మినారాయణ. అది బీజేపీ నేతలకు అర్థం కావడం లేదు. అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా బలమైన ప్రజాభిప్రాయం ఉంది. ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయా..? టీడీపీ పదిహేనేళ్ల పాటు.. అధికారంలో లేదు. ఒక వేల టీడీపీ పట్ల ప్రజావ్యతిరేకత ఉంటే..దాన్ని ఉపయోగించుకోవడానికి వైసీపీ రెడీగా ఉంది. అస్సాంలో వారికి ఎవరూ లేరు. ఆ విధంగా.. అస్సాంతో.. ఏపీకి ఎలాంటి పోలిక లేదు.

గెలుస్తామని అంటే.. గెలిచేస్తారా ఏంటి..?

కార్యవర్గ సమావేశంలో.. అధికారంలోకి వస్తాం.. అధికారంలోకి రాకపోతే కింగ్ మేకర్ అవుతాం అని రామ్ మాధవ్ చెప్పుకొచ్చారు. వాళ్ల పార్టీ కార్యవర్గం మీటింగ్‌లో మనం ఓడిపోతాం.. మనకు డిపాజిట్లు రావు.. ప్రజలు ఓట్లేయరు.. మనం ప్రత్యేకహోదా ఇవ్వకుండా అన్యాయం చేశాం అని చెప్పుకోలేరు కదా..! విష్ణుకుమార్ రాజు.. రెండు రోజుల కిందట శానససభలో.. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ కి కేంద్రం అన్యాయం చేసిందని… తీర్మానం పెడితే.. దాన్ని వ్యతిరేకించలేదు. కేంద్రం ఏపీకి న్యాయం చేసిందని చెప్పుకోలేకపోయాడు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతూంటే.. మొదటగా నేను ఆంధ్రుడ్ని.. అందుకే..మౌనంగా.. ఈ తీర్మానానికి మద్దతిస్తున్నానని ప్రకటించారు. అంటే ఏపీ బీజేపీ ఎమ్మెల్యేలు.. కూడా.. కేంద్రం ఏపీకి అన్యాయం జరిగిందని… తీర్మానిస్తూంటే.. ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి..? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా.. ! అందువల్ల .. ఏపీ రాజకీయాలకు… అరుణాచల్ ప్రదేశ్ , అస్సాం, త్రిపుర రాజకీయాలకు ఏ మాత్రం పోలిక లేదు. ఈ రాష్ట్రాలను చూపించి అధిాకరంలోకి వస్తామని చెప్పుకుంటే.. అది పార్టీ నేతలను ఉత్సాహం కలిగించేందుకే తప్ప… పార్టీని బలపడటానికి ఏ మాత్రం ఉపయోగపడదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close